ఉరి కొయ్యను ముద్దాడి తన ప్రాణాలను అర్పించిన ధైర్యశాలి
హొళగుంద, న్యూస్ వెలుగు: మండల కేంద్రంలో శనివారం భారతదేశ స్వాతంత్ర్య సమర యోధుడు రగిలే విప్లవ జ్వాల సర్దార్ భగత్ సింగ్ 117వ జయంతి వేడుకలను ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ముందుగా సర్దార్ భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీరంగ,మండల కార్యదర్శి సతీష్ కుమార్,మండల అధ్యక్షులు కాకి గాదిలింగ మాట్లాడుతూ సర్దార్ భగత్ సింగ్ 23 ఏళ్ళ వయస్సులోనే ఉరి కొయ్యను ముద్దాడి తన ప్రాణాలను అర్పించిన ధైర్యశాలి అన్ని చెప్పారు.మరియు చిరునవ్వుతోనే మృత్యువును కౌగిలించుకుని దేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసి అమరులైన సర్దార్ భగత్ సింగ్,రాజ్ గురు,సుఖ్ దేవ్ స్ఫూర్తితో వారి అడుగుజాడల్లో నడవాలని యువకులకు పిలుపునిచ్చారు.మన దేశ రాష్ట్ర భవిష్యత్తు కోసం విద్యార్థులు యువకులు ఉద్యమాలకు నడుంబిగించి పోరాటాలకు సిద్ధం కావాలని కోరారు.ఈ కార్యక్రమంలో నాయకులు వెంకటేష్,తరుణ్,రంజిత్ తదితరులు పాల్గొన్నారు.