జర్నలిస్టుల సంక్షేమమే మా ధ్యేయం

జర్నలిస్టుల సంక్షేమమే మా ధ్యేయం

ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు సి.పుల్లయ్య
శ్రీ సత్యసాయి, కదిరి న్యూస్ వెలుగు:జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా దాదాపు 5 దశాబ్దాల క్రితం ఏర్పాటు చేసిన ఏపీయూడబ్ల్యూజే ఎన్నో సంక్షోభాలకు గురైన తట్టుకుని నిలబడి మరెన్నో జర్నలిస్టుల సమస్యలకు పరిష్కారం చూపించిన ఘనత మన సంఘానికి మాత్రమే దక్కుతుందని జిల్లా అధ్యక్షులు సి.పుల్లయ్య పేర్కొన్నారు. ఆదివారం పట్టణంలోని దత్త ఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే నియోజకవర్గ నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..జర్నలిస్టుల సంక్షేమంతో పాటు వారి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తాం.అర్హత కలిగిన ప్రతి ఒక్క జర్నలిస్టు సోదరుడి చిరకాల కోరిక అయినటువంటి సొంత ఇంటి కల నెరవేర్చడానికి మొదట ప్రాధాన్యతను ఇస్తాం.ప్రభుత్వం అందజేసే హెల్త్ కార్డులను అందించి అందరికీ ఆరోగ్యం సదుపాయం అందుబాటులోకి తీసుకొస్తాం.జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలలో జర్నలిస్ట్ సోదరుల పిల్లలకు ఉచిత విద్యను అందించేందుకు సత్వర చర్యలు చేపట్టేలా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాం.
జిల్లా కేంద్రంలో ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసి జర్నలిస్టుల కోసం సంక్షేమ నిధి ఏర్పాటు చేసే ఆపదలలో ఉన్న జర్నలిస్టు సోదరులకు చేయూతనిస్తాం.జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రెస్ క్లబ్ ల నిర్మాణాలకు సహకరిస్తాం.ఐజేయు సభ్యులు శ్రీనివాసులు మాట్లాడుతూ గతంలో జర్నలిస్టుపై జరిగిన దాడులను ప్రస్తావిస్తూ ఆరోజు వారికీ అండగా ఏపీయూడబ్ల్యూజే నిలబడిన సంగతి గుర్తు చేశారు.ఆంధ్రప్రభ బ్యూరో ఇంచార్జ్ ప్రసాద్ మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం నిత్యం మీ వెంట మేముంటాం.సీనియర్ జర్నలిస్ట్ ఉద్దండం చంద్రశేఖర్ మాట్లాడుతూ నిబద్ధత కలిగిన జర్నలిస్టు సోదరుడు ఎలాంటి భయాందోళనలు లేకుండా రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా పనిచేయగలుగుతున్నాడు అంటే అతనికి కచ్చితంగా ఏపీయూడబ్ల్యూజే తోడుగా ఉందని అర్థం చేసుకోవచ్చు.ఈ కార్యక్రమంలో కదిరి డివిజన్ పరిధిలోని అన్ని మండలాల ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ విలేకరులు పాల్గొన్నారు.ఏకగ్రీవంగా ఎన్నికైన నూతన కమిటీ:కదిరి డివిజన్ అధ్యక్షులు: ప్రవీణ్ కుమార్ రెడ్డి (ఆంధ్రప్రభ),జనరల్ సెక్రటరీ సాదిక్ వలి. (వార్త),ఆర్గనైజర్ సెక్రెటరీ నరేందర్ రెడ్డి (99 టీవీ),ట్రెజరర్: జిలాన్ (సాక్షి),ఉపాధ్యక్షులు: శివశంకర్ (సూర్య),రవి (సాయంకాలం),చంద్రశేఖర్ రెడ్డి (ఆర్ టివి),సహాయ కార్యదర్శిలు:ప్రభాకర్ (సూర్య), రామ్మోహన్ (సాక్షి),అల్లా బకాష్ (వార్త)

కార్యవర్గ సభ్యులు: శ్రీనివాస్ (విశాలాంధ్ర), సతీష్ రెడ్డి (ఆంధ్రప్రభ), ఆంజనేయులు(వార్త), అజయ్ (కదిరి డిజిటల్ కేబుల్), లక్ష్మీపతి (ఆంధ్రప్రభ),మాధవ (సూర్య), రఘునాథ్ రెడ్డి (సాక్షి), శివ శంకర్ రెడ్డి (సాక్షి) రాజశేఖర్ రెడ్డి (వార్త).

Author

Was this helpful?

Thanks for your feedback!