పేదలకు ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం

పేదలకు ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం

మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి

నల్లమాడ, న్యూస్ వెలుగు; ప్రతి మనిషికి ఆరోగ్యమే మహాభాగ్యమని మాజీమంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి పేర్కొన్నారు. నల్లమాడ మండలం రెడ్డిపల్లి ప్రభుత్వ పాఠశాలలో మార్క్ గుండె ఆసుపత్రి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఉచిత గుండె వైద్య శిబిరానికి మాజీ మంత్రి పల్లె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్య సేవలు కింద పేదలకు ఆరోగ్యశ్రీ ద్వారా 20 లక్షల రూపాయలతో కార్పొరేట్ ఆసుపత్రిలో ఉచిత వైద్యం పొందే సౌకర్యం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ వీటిని సద్వినియం చేసుకోవాలని ఆయన కోరారు ముఖ్యంగా మనిషి కష్టపడే తత్వాన్ని అలవర్చుకోవాలని సూచించారు .మారుతున్న కాలానికి అనుగుణంగా మనిషి తమ ఆహారపు అలవాట్లు మార్చుకోవాలని తెలిపారు. గుండె జబ్బులు రాకుండా ముందస్తుగా చికిత్సలు నిర్వహించుకోవాలని తెలిపారు ఆరోగ్యంగా ఉండాలంటే ధూమపానం ,మద్యం మాంసం అలవాట్లకు ప్రతి ఒక్కరూ దూరంగా ఉండాలని , మంచి ఆకుకూరలు ,కూరగాయలు పప్పు ధాన్యాలు ఆహారంగా ప్రతిఒక్కరూ వాడాలని సూచించారు. ప్రభుత్వం కల్పించే వైద్య సౌకర్యాలను పేదలు ఉపయోగించుకోవాలని కోరారు ప్రమాదవశాత్తు ఎవరైనా పేదలు మృతిచెందితే అలాంటి వారికి ప్రభుత్వం పది లక్షల రూపాయలు వరకు ఇచ్చే సౌకర్యం కూడా త్వరలో తీసుకొస్తుందని తెలిపారు ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధిని చేపడుతోందని వివరించారు .వైద్య శిబిరానికి విచ్చేసిన వారందరిని మాజీ మంత్రి అప్యాయంగా పలకరించారు. అక్కడ పాల్గొన్న వైద్యులను అభినందించారు.
ఎర్ర వంకపల్లిలో ఓబులప్ప కోడలు భార్గవి శ్రీమంత కార్యక్రమానికి మాజీమంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు భార్గవిని ఆశీర్వదించి చీర జాకెట్టు కిట్ ను మాజీ మంత్రి అందజేశారు. నల్లమాడ లో టీడీపీ కార్యకర్త కుటుంబాన్ని మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి పరామర్శించారు. లివర్ సమస్యతో బాధపడుతున్న టిడిపి కార్యకర్త వెంకటలక్ష్మి నీ పరామర్శించి రూ.10 వేలు ఆర్థిక సహాయం అందజేశారు. ధైర్యంగా ఉండి,త్వరగా కోలుకొని ఆరోగ్యంతో ఉండాలని మాజీ మంత్రి సూచించారు.
ఈ కార్యక్రమంలో మార్క్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ నాగరాజు ఉపాధ్యాయులు జేమ్స్ ,టీడీపీ మండల కన్వీనర్ మైలే శంకర్ ,రెడ్డిపల్లి ప్రైవేట్ వైద్యుడు డాక్టర్ నాయుడు ,ప్రేమానంద రెడ్డి , స్థానిక టిడిపి జనసేన బిజెపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!