
పి.డి అమర్నాథ్ రెడ్డికి మానవత ఆత్మీయ వీడ్కోలు
కర్నూలు, న్యూస్ వెలుగు: మానవతతో ఆత్మీయత మరువలేనిది” అని డ్వామా పథక సంచాలకులు అమర్నాథ్ రెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక వెంకటరమణ కాలనీలోని మానవత జిల్లా కార్యాలయంలో నెలవారీ సమావేశంలో ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమం ప్రోగ్రాం కమిటీ చైర్మన్ యుగంధర్ శెట్టి, మానవత నగర అధ్యక్షులు శోభన్ బాబు అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ మానవతా సేవలు ప్రశంసనీయమని తాను సభ్యుడుగా గర్వపడుతున్నారని ప్రతి పౌరుడు ప్రకృతిని ప్రేమించాలని, కాపాడాలని పిలుపునిచ్చారు. గాలి మట్టి నీరు విపరీతంగా కలుషితం అవుతుందని వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. మానవత జిల్లా కన్వీనర్ మనోహర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో నాలుగు సంవత్సరాలు పీడి అమర్నాథ్ రెడ్డి మానవతకు ఇతోదికంగా సహాయం చేశారని కొనియాడారు. మానవత విద్యా, ఆరోగ్యం, పర్యావరణం, మహిళా సాధికారత, రక్తదానం, నేత్రదానంలో పనిచేస్తుందని ఇటీవల మరణించిన ఇద్దరు వ్యక్తుల నేత్రాలు సేకరించడం ద్వారా నలుగురికి కంటిచూపు ప్రసాదించడం జరిగిందని తెలిపారు. మానవత యూనిట్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ పాటిల్.హనుమంత్ రెడ్డి మాట్లాడుతూ పిడి అమర్నాథ్ రెడ్డి మానవతా సేవా కార్యక్రమాలలో పాల్గొంటూ వేలాది మొక్కలు నాటడానికి నాంది పలికారన్నారు. హైదరాబాద్ నగరంలో మానవత యూనిట్ ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు. మానవత కుటుంబ సభ్యులు బదిలీపై వెళ్తున్న పీడీ అమర్నాథ్ రెడ్డిని ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మానవత మాజీ అధ్యక్షులు శివారెడ్డి, ప్రధానకార్యదర్శి, కోశాధికారులు, హరికిషన్, రమణ, శేషయ్య, ప్రభాకర్, చింతలపల్లి రామకృష్ణ, సుధీర్ రాజు,అశోక్, మహమ్మద్ మియా, మీనాక్షి రెడ్డి, ప్రతాపరెడ్డి, తిరుపతి సాయి, బాలకృష్ణ రెడ్డి,వీర ప్రతాప్,సరిత, శివ శంకర్, సురేష్, సఖ్యత, ప్రసాద్ బాబు, మిజ మిల్, రాజు, సూరి, రాజశేఖర్ రెడ్డి వరప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.