
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం..రద్దు
కర్నూలు, న్యూస్ వెలుగు; కర్నూలు జిల్లా, పత్తికొండ మండలం పుచ్చకాయలమడ గ్రామంకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి పర్యటన లో భాగంగా పోలీసు అధికారులు బందోబస్తు విధులలో ఉంటున్న సందర్భంగా” సెప్టెంబర్ 30వ తేదీ న సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం)కార్యక్రమం ను ” రద్దు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.కావున అర్జీదారులు సుదూర ప్రాంతాల నుండి వ్యయ , ప్రయాసలతో కర్నూల్, కొత్తపేట , కర్నూలు టు టౌన్ పోలీసు స్టేషన్ ప్రక్కన ఉన్న ఎస్పీ గారి క్యాంపు కార్యాలయంలో జరగబోయే జిల్లా ఎస్పీ “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ” కార్యక్రమానికి రావొద్దని తెలిపారు.జిల్లా ప్రజలు (ఫిర్యాదుదారులు) ఈ విషయాన్ని గమనించగలరని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు.
Was this helpful?
Thanks for your feedback!