మా మూడు పార్టీల లక్ష్యం.. ధర్మవరం అభివృద్ధే

మా మూడు పార్టీల లక్ష్యం.. ధర్మవరం అభివృద్ధే

ధర్మవరం కూటమిలో ఎలాంటి విబేధాలు లేవు

స్పష్టం చేసిన ధర్మవరం టీడీపీ ఇన్ ఛార్జి పరిటాల శ్రీరామ్

గతంలో మున్సిపల్ కమిషనర్ నుంచి చాలా ఇబ్బందులు పడ్డాం

అన్ని అంశాలను పరిశీలిస్తామని సత్యకుమార్ చెప్పారు

త్వరలోనే ఈ అంశానికి ఫుల్ స్టాప్ పడుతుంది.. మధుసూదన్ రెడ్డి

మా మధ్య విబేధాలు వస్తే సంతోషించే వారు ఉన్నారు.. సందిరెడ్డి శ్రీనివాసులు

సత్యసాయి,న్యూస్ వెలుగు;   శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం ఎన్డీఏ కూటమి పార్టీల మధ్య ఎలాంటి విబేధాలు లేవని.. తెలుగుదేశం పార్టీ టీడీపీ ఇన్ ఛార్జ్ పరిటాల శ్రీరామ్ స్పష్టం చేశారు. గత రెండు మూడు రోజులుగా జరుగుతున్న అంశాల మీద.. ధర్మవరం టిడిపి కార్యాలయంలో మూడు పార్టీల నాయకులతో కలిసి పరిటాల శ్రీరామ్ మీడియా సమావేశం నిర్వహించారు. కూటమిలో ఎలాంటి విభేదాలు లేవని.. కమిషనర్ నియామకం అంశంపై తమకు అభ్యంతరాలు ఉన్నాయన్నారు. గతంలో ఆయన కమిషనర్ గా పని చేసిన సమయంలో వైసీపీకి కనుకూలంగా వ్యవహరించి.. టిడిపి నేతలను ఇబ్బంది పెట్టారని.. ఇదే అంశాన్ని మంత్రి సత్య కుమార్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. అయితే ఈ విషయాలు ఏవి సత్యకుమార్ కు తెలయవని చెప్పినట్టు వివరించారు. ఆయన అన్ని అంశాలు పరిశీలించి కచ్చితంగా తగిన నిర్ణయం తీసుకుంటానని హామీ ఇచ్చినట్లు చెప్పారు. ఎన్నికల ముందు మేము ఎలా కలసి ఉన్నామో… ఇప్పుడు అలానే కలిసి ఉన్నామని స్పష్టం చేశారు. ధర్మవరంని అభివృద్ధి చేయడమే తమ ముందున్న లక్షమని.. పరిటాల శ్రీరామ్ అన్నారు. కచ్చితంగా ధర్మవరంకి సత్యకుమార్ ప్లస్ అవుతారని ఆయన అభిప్రాయపడ్డారు. మొదటి ఆరు నెలలు చిన్న చిన్న సంఘటలు ఉంటాయని.. అధికారులు, నాయకులు అంతా సెట్ కావడానికి సమయం పడుతుందన్నారు. ఇప్పుడిప్పుడే అన్నీ సెట్ అవుతున్నాయని.. ఇక ఫోకస్ అంతా అభివృద్ధి మీద ఉంటుందన్నారు. గతంలో భూకబ్జాలు, అనేక అక్రమాలు గురించి కూడా సత్యకుమార్ కు చెప్పామని.. వాటిన్నింటిపై కూడా చర్యలు ఉంటాయన్నారు. ఇక్కడ చాలా మందికి జీవనోపాధి కల్పించాల్సిన అవసరం ఉందని.. ముఖ్యంగా స్వయం ఉఫాది కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. మరోవైపు ధర్మవరం సబ్ జైల్ వద్ద సంఘటన.. అనుకోకుండా జరిగిందన్నారు. ఊరు నుంచి బహిష్కరించాలన్న వ్యాఖ్యలపై అది వారు కోరుకుంటే ఏమీ చేయలేమన్నారు.

త్వరలోనే ఫుల్ స్టాప్ పడుతుంది.. చిలకం మధుసూదన్ రెడ్డి

ధర్మవరం కమిషనర్ నియామకం ఉద్దేశ్యపూర్వకంగా జరిగింది కాదని.. దీనిని అడ్డం పెట్టుకుని మా మధ్య విబేధాలు ఉన్నట్టు చిత్రీకరిస్తున్నారని.. జనసేన నాయకుడు చిలకం మధుసూదన్ రెడ్డి అన్నారు. సాధారణ బదిలీల్లో భాగంగా కమిషనర్ నియామకం జరిగిందని.. ఇది మంత్రి సత్యకుమార్ తెలిసి జరిగింది కాదన్నారు. అయితే ఆయన నియామకం పట్ల తమకున్న అభ్యంతరాల్ని సత్యకుమార్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. కమిషనర్ గతంలో మా వాళ్లను ఇబ్బంది పెట్టారని.. అందుకే మా కార్యకర్తలకు, నాయకులకు మల్లికార్జున రావడం ఇష్టం లేదన్నారు. దీనిపై మంత్రి సత్యకుమార్ స్పష్టమైన హామీ ఇచ్చారని.. కమిషనర్ని దూరం పెడుతారని ఆశిస్తున్నట్టు చెప్పారు. త్వరలోనే మొత్తం ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడుతుందన్నారు. శనివారం రోజు జరిగిన సంఘటన అనుకోకుండా జరిగిందేనన్నారు.

ముగ్గురూ మంచి సమన్వయంతో ఉన్నారు.. సందిరెడ్డి శ్రీనివాసులు

కూటమి పార్టీల మధ్య విబేధాలు, అపోహలు వస్తే.. చూసి సంతోషించే వారు చాలా మంది ఉన్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాసులు అన్నారు. అయితే వారికి అలాంటి అవకాశం ఇవ్వమన్నారు. కమిషనర్ పై ఇలాంటి అభిప్రాయం ఉందని.. మంత్రి సత్యకుమార్ కు తెలియదన్నారు. అది తెలిసి ఉంటే ఈ నియామకం జరగదన్నారు. అభివృద్ధి కోణంలోనే మంచి యువకుడు అధికారిగా రావాలని కోరుకున్నట్టు తెలిపారు. కచ్చితంగా కమిషనర్ అంశాన్ని పునరాలోచించి తగిన నిర్ణయం తీసుకుంటారన్నారు. ప్రస్తుతం ధర్మవరంలో మంత్రి సత్యకుమార్ తో పాటు పరిటాల శ్రీరామ్, సందిరెడ్డి శ్రీనివాసులు మంచి సమన్వయంతో ఉన్నారని సందిరెడ్డి స్పష్టం చేశారు…

Author

Was this helpful?

Thanks for your feedback!