
పిడుగుపాటుకు మృతి చెందిన కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి సవితమ్మ
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి తక్షణమే ఎగ్రేషియా చెక్కును అందజేసిన మంత్రి సవితమ్మ
సత్యసాయి, న్యూస్ వెలుగు; సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం దిగువ గంగంపల్లి తాండా లో ఆదివారం తెల్లవారుజామున పిడుగు పడిచనిపోయిన దాశరథి నాయక్ కుటుంబాన్ని పరామర్శించి చిత్రపటానికి నివాళులు అర్పించిన మంత్రి సవితమ్మ గారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి మంత్రి సవితమ్మ తీసుకెళ్ళి తక్షణమే ఎగ్రేషియా చెక్కును అందజేసిన మంత్రి సవితమ్మ మరణించిన వారికి ఒక్కొక్కరికి 4 లక్షలు ఒక్క పాడి ఆవు 37500 మరణించిన ఇద్దరికీ 8,00,000 రూపాయలు మరణించిన పాడి ఆవులు75,000 రూపాయలు చెక్కును దాశరథి నాయక్ కుమారుడు జగదీష్ నాయక్ కు అందచేసిన మంత్రి సవితమ్మ గారు .ఈ కార్యక్రమంలో అధికారులు గోరంట్ల మండల కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.