
అన్నదాన కార్యక్రమం ఏర్పాటు
ఒంటిమిట్ట, న్యూస్ వెలుగు; కడప జిల్లా రాజంపేట నియోజకవర్గ పరిధిలోని ఒంటిమిట్ట చెరువు కట్టపై వెలసిన శ్రీ కాశీ విశ్వేశ్వరాలయంలో సోమవారం సందర్భంగా నిర్వాహకులు దాతల ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకులు హరి ప్రసాద్,అంగదాల. వెంకటసుబ్బయ్య, దత్తాత్రేయులు, రోశయ్య, ఈశ్వరయ్య, అయ్యవారయ్య హాజరై భక్తులకు భక్తిశ్రద్ధలతో భోజన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలిసి తెలియక ప్రతి ఒక్కరూ ఎన్నో కర్మలు చేస్తూ ఉంటారని ఆ కర్మలు తొలగిపోయేందుకు సత్కర్మలలో భాగంగా బాటసారులకు అన్నంతో కడుపు నింపడం ద్వారా చేసిన పాపాలు పటాపంచలవుతాయని మన పురాణాలు తెలుపుతున్నాయన్నారు. ప్రతి ఒక్కరూ మానవసేవయే మాధవ సేవగా భావించి మంచి కార్యక్రమాలు చేయుచు ఆదర్శంగా నిలిచి ముక్తిని పొంది శివ కటాక్షాలు పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వహకుడు గుండ్రాతి. మహేశ్వరయ్య తదితరులు ఉన్నారు.