జిల్లా వ్యాసరచన పోటీలలో విజేతగా నిలిచిన విద్యార్థి షేక్ సనావుల్లా

జిల్లా వ్యాసరచన పోటీలలో విజేతగా నిలిచిన విద్యార్థి షేక్ సనావుల్లా

నంద్యాల, న్యూస్ వెలుగు; నంద్యాల జిల్లా స్థాయి వ్యాసరచన పోటీలలో విజేతగా నిలిచిన చైతన్య ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విద్యార్థి షేక్ సనావుల్లా  నంద్యాల జిల్లా స్థాయి స్వర్ణాంద్ర  2047 కాంపిటీషన్స్ జిల్లా విద్యాశాఖధికారి కార్యాలయం నందు సోమవారం రోజున విద్యాశాఖ ఆధ్వర్యంలో జరిగింది. ఇందులో భాగంగా జిల్లా స్థాయి వ్యాసరచన పోటీ నందు ఆత్మకూర్ పట్టణం నందలి పెద్ద కబేలాలోని చైతన్య ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ కు చెందిన 10 వ తరగతి విద్యార్థి షేక్ సనావుల్లా విజేతగా నిలిచి ఆత్మకూర్ మండలం పేరును జిల్లా స్థాయి నందు నిలబెట్టడం జరిగినది. ఆ విద్యార్థిని పాఠశాల కరెస్పాండెంట్ A.తాజుద్దీన్ గారు, co-ఆర్డినేటర్స్ B.న్యామతుల్లా, M. అశ్వక్ గారు మరియు ఉపాధ్యాయ బృందం అభినందనలు తెలియజేసినారు.చైతన్య ఇంగ్లీష్ మీడియం హై స్కూల్, నవ భారత్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు తోటి విద్యార్థి షేక్ సనావుల్లాను విజేతగా నిలవడం పట్ల హర్ష ద్వానాలతో స్వాగతం పలికి అభినందనలతో హోరేత్తి0చారు.

Author

Was this helpful?

Thanks for your feedback!