
అభివృధ్ధి సంక్షేమం కూటమి ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సవిత
పెనుకొండ న్యూస్ వెలుగు : రాష్ట్ర వ్యాప్తంగా మొదలైన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజవర్గం పెనుకొండ మున్సిపాలిటీ పరిధిలోని 12,వార్డు 13వ వార్డులో వరుసగా నాలుగో నెల ఇంటి వద్దకే వచ్చి, ఒకటో తారీఖునే పింఛన్ ను పంపిణీ చేసిన బీసీ సంక్షేమ చేనేత జౌళిశాఖ మంత్రివర్యులు శ్రీమతి సవితమ్మ గారు, ఉద్యోగులు, స్థానిక నేతలు.

ఫించన్ దారులతో మంత్రి సవితమ్మ మాట్లాడుతు చంద్రన్న ప్రభుత్వం ఎలా ఉంది,ఫింఛన్ ఎంత వస్థోంది,సమస్యలు ఏమైనా ఉన్నాయ అని అడిగి తెలుసుకున్నారు.వైసిపి పాలనలో రాష్ర్టం 40 ఎళ్ళు వెనక్కి వెళ్ళిపోయిందని,ఇచ్చిన మాటలన్ని తప్పి జగన్ మాట,మడమ తిప్పేసారన్నారు,చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అవగానే ఇచ్చిన మాట ప్రకారం ఫించన్ పెంచాడని,రాష్ర్టాన్ని అభివృధ్ధిలో నడపడం మొదలెట్టాడని,సంక్షేమం తో పాటు అభివృధ్ధి చేసి చూపిస్తున్నాడన్నారు. గత ఐదు సంవత్సరాలలో వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి కుంటుపడిందని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఒకపక్క అభివృద్ధితో పాటు మరోపక్క సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని మంత్రి సవితమ్మ తెలియజేశారు. అదేవిధంగా పెనుకొండ టౌన్ లో అమృత్ స్కీం ద్వారా 87 కోట్ల తో OHSR ట్యాంకులు పైప్ లైన్ ఇంటింటికి కొలాయి ద్వారా నీటి మంచినీటి అందజేస్తామని, అదేవిధంగా సెంటర్ లైటింగ్ కి 10 లక్షల రూపాయలతో ప్రతిపాదనలు కూడా పంపామని ,డివైడర్స్ కు మధ్యలో ప్లాంటేషన్ కోసం ఒక లక్ష రూపాయలు కేటాయించామని మరియు డ్రైనేజ్ అండ్ డి షెల్టింగ్ కి 11 లక్షల రూపాయలతో నిధులు కేటాయించామని ,అదేవిధంగా రైల్వే స్టేషన్ రోడ్డు, కోనాపురం రోడ్డుకి ప్రతిపాదనలు పంపామని, టిటిడి కళ్యాణ మండపం కోసం 6 కోట్లతో మూడు అంతస్తుల నిర్మించడానికి టిటిడి వారు ఆమోదించారని పెనుకొండ లో పేద విద్యార్థుల కోసం ఒక ఏంజెపి స్కూల్ కూడా తెచ్చామని ఇస్కాన్ వారి సహకారంతో కొండమీద లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ కూడా కడతామని తెలియజేసిన మంత్రి సవితమ్మ గారు .. కార్యక్రమంలో అధికారులు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు