హోళగుంద న్యూస్ వెలుగు; వంట గ్యాస్ కోసం వినియోగదారులు నానా కష్టాలు పడుతున్నారు.గ్యాస్ లోడ్ బండి వస్తుందో రాదో అని వినియోగదారులు సిలండర్లు లైన్లో పెట్టి కళ్లుకాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. హోళగుంద మండల

కేంద్రానికి మల్లికార్జున భారత్ గ్యాస్ ఏజెన్సీ ఆదోని వారు వారంలో మంగళవారం ఒకరోజు మాత్రమే గ్యాస్ సిలిండర్లు సరఫరా చేస్తున్నారు. స్థానిక పాత పోలీస్ స్టేషన్ వెనుక ఉన్న స్థలంలో ప్రతి మంగళవారం వినియోగదారులు తమ గ్యాస్ సిలిండర్లను క్యూలో పెట్టి కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తుంటారు. అయితే సదరు ఏజెన్సీ వారు ఏ సమయానికి చేరుకుంటారో ఎవరికి తెలియని పరిస్థితి నెలకొంది. తమ గ్యాస్ సిలిండర్ క్యూలో పెట్టి ఎదురు చూస్తుంటే ఏజెన్సీ సిబ్బంది మాత్రం మధ్యదారిలో అక్కడక్కడ ఆగి సిలిండర్లు సరఫరా చేస్తున్నారని, బ్లాక్ లో గ్యాస్ సిలిండర్లు అమ్మే అక్రమార్కులకు సిలిండర్లు సరఫరా చేస్తున్నట్లు వినియోగదారులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో గ్యాస్ లోడ్ తెచ్చిన సిబ్బందితో వినియోగదారులు వాగ్వాదానికి దిగారు. తమ పనులు మానుకొని ఎండలో ఉదయం నుండి పడిగాపులు కాస్తున్నామని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేశారు. దసరా పండుగ సమీపిస్తున్న తరుణంలో గ్యాస్ సిలిండర్ సరైన సమయానికి సరఫరా చేయకపోతే ఎలా అని ఆవేదన వ్యక్తం చేశారు.ఇప్పటికైనా మండల కేంద్రంలో వంటగ్యాస్ కష్టాలు లేకుండా సదరు ఏజెన్సీ, సంబంధిత అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు.
Thanks for your feedback!