ప్రభుత్వ సర్వజన వైద్యశాల లో  గాంధీకి ఘన నివాళి

 ప్రభుత్వ సర్వజన వైద్యశాల లో  గాంధీకి ఘన నివాళి

కర్నూలు, న్యూస్ వెలుగు; కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఆసుపత్రి ఆవరణలో ఉన్న జాతిపిత మహాత్మా గాంధీ 155వ జయంతిని పురస్కరించుకొని మహాత్మ గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించినట్లు తెలియజేశారు. మాహాత్మ గాంధీజీ సందేశాన్ని మనం అంతా గుర్తు తెచ్చుకోగా అహింస, శాంతి అనేది మన మధ్యలో ఉండాలి, ప్రతి మనిషి తన దేశం పట్ల మంచి అంకితభావంతో ఉంటూ మనం దేశం కోసం స్వాతంత్రం తీసుకొచ్చిన గాంధీజీ గారి స్ఫూర్తిని ఈ స్వాతంత్ర ఫలాలను ఉపయోగించుకున్నందుకు చాలా గర్వంగా తల ఎత్తుకొని తిరుగుతున్నామంటే అది మన గాంధీజీ గారి వళ్ళే అని అన్నారు.  ఈ కార్యక్రమానికి డిప్యూటీ సివిల్ సర్జన్, డా.వెంకటరమణ, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ డా.శివబాల నగాంజన్, నర్సింగ్ సూపరింటెండెంట్, శ్రీమతి. సావిత్రిబాయి, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నట్లు, ఆసుపత్రి సూపరింటెండెంట్, డా.ప్రభాకర రెడ్డి,  తెలిపారు.

Author

Was this helpful?

Thanks for your feedback!