జొన్నగిరి ఎస్సై ను మర్యాదపూర్వకంగా కలిసిన వైసీపీ నాయకులు
తుగ్గలి న్యూస్ వెలుగు ప్రతినిధి: తుగ్గలి మండల పరిధిలోని జొన్నగిరి గ్రామంలో స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్ నూతన ఎస్సై జయశేఖర్ గౌడ్ ను తుగ్గలి మండల వైస్సార్సీపీ మండల కన్వీనర్ జిట్టా నాగేష్ ఆధ్వర్యంలో వైస్సార్సీపీ నాయకులు శుక్రవారం రోజున మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది.ఈ కార్యక్రమంలో తుగ్గలి మండల జడ్పీటీసీ పులికొండ నాయక్,మాజీ జడ్పీటీసీ నారాయణ నాయక్,వైస్సార్సీపీ నాయకులు పక్కిరప్ప,లక్ష్మి తాండ వెంకటేష్ నాయక్,మార్కెట్ యార్డ్ మాజీ డైరెక్టర్ కృష్ణ నాయక్ తదితరులు మర్యాదపూర్వకంగా కలిసి పూలమాల వేసి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా వైసీపీ నాయకులు మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణ కొరకు కృషి చేయాలని వారు ఎస్సై కు తెలియజేశారు.
Was this helpful?
Thanks for your feedback!