హోళగుంద న్యూస్ వెలుగు : మండల కేంద్రంలో మేజర్ గ్రామ పంచాయతీ వేలంల మొండి బకాయిలను సత్వరమే వసూలు చేయాలని శుక్రవారం టిడిపి సీనియర్ నాయకులు గాలి వీరభద్ర గౌడ్,ఎర్రి స్వామి కోరారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ పంచాయతీకి సంబంధించిన ఆదాయ వనరులను గతంలో వేలం పాటలో అధిక పాటకు దక్కించుకొని దక్కించుకున్న మొత్తాన్ని నేటివరకు గ్రామ పంచాయతీకి చెల్లించకుండా బకాయిలు మిగిలించిన వారికి సత్వరమే నోటీసులు జారీ చేసి వసూలు చేయాలని తెలియజేశారు.లేని యెడల గ్రామ పంచాయతీ కార్యాలయాని ముట్టడించి కార్యాలయానికి తాళం వేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సోమశేఖర్ గౌడ,సూరన్న,శేఖన్న తదితరులు పాల్గొన్నారు. కార్యదర్శి వివరణ కోరగా,  సంబంధిత పాటదారులకు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు .  త్వరలో వసూలు చేస్తామని పేర్కొన్నారు.
                
                    
                    
                    
                    
                    
                
                            
        
			
				
				
				Thanks for your feedback!