రాష్ట్రంలోనే  సత్యసాయి జిల్లాను అగ్రపథాన్ని నిలబెడదాం

రాష్ట్రంలోనే  సత్యసాయి జిల్లాను అగ్రపథాన్ని నిలబెడదాం

 రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి సవిత
 నియోజక వర్గాల వారీగా యాక్షన్ ప్లాన్లు రూపొందించండి.
 జిల్లాలో ఉన్న వనరులు సద్వినియోగం చేసుకుంటే మనదే అగ్రస్థానం.
 అధికారులు మరింత బాధ్యతగా పనిచేయాలన్న మంత్రి.
 చేనేత అన్ని విధాలా అండగా ఉన్నాం
నేతన్నలకు ఆర్థిక భరోసా కల్పించేలా కార్యక్రమాల నిర్వహణ : మంత్రి సవిత

పుట్టపర్తి, న్యూస్ వెలుగు; దేశంలో ఏపీని అగ్రగామిగా నిలపాలని సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని, ఆయన స్ఫూర్తితో రాష్ట్రంలో శ్రీసత్యసాయి జిల్లాను అగ్రపథాన నిలుపుదామని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత  జౌళి శాఖామాత్యులు ఎస్.సవిత పిలుపునిచ్చారు. శుక్రవారంస్వర్ణాంధ్ర @2047 జిల్లా విజన్ ప్లాన్ పుట్టపర్తిలోజిల్లాస్థాయి సమావేశం పుట్టపర్తి సాయిరామంమ్ లో నిర్వహించారుఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంక్షేమ మరియు చేనేత శాఖ మంత్రివర్యులు
సవితమ్మ, పుట్టపర్తి ఎమ్మెల్యే సింధూర రెడ్డి,కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్, జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ , సిపిఓ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు, ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మంత్రివర్యులు మాట్లాడుతూ రాబోయే అయిదేళ్లలో రాష్ట్రంలో అభివృద్ధి చేపట్టాలన్ని, ఏపీని దేశంలోనే అగ్రగామిగా నిలపాలని సీఎం చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. దీనిలో భాగంగా జిల్లాల వారీగా యాక్షన్ ప్లాన్ అందించాలని సీఎం ఆదేశించారన్నారు. ఆయన ఆలోచనలకు అనుగుణంగా అధికారులు, ప్రజాప్రతినిధులు పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. అన్ని శాఖల అధికారులు నియోజక వర్గాల వారీగా తమ శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి, ఎటువంటి అభివృద్ధి చేపట్టాలో చర్చించి యాక్షన్ ప్లాన్ రూపొందించాలని మంత్రి ఆదేశించారు. జిల్లాలో వ్యవసాయం, హార్టికల్చర్, పరిశ్రమల ఏర్పాటుకు అనువైన వాతావరణం ఉందని, అభివృద్ధికి కావాల్సిన అన్ని వనరులూ ఉన్నాయని అన్నారు. వాటిని ప్రజాప్రతినిధులు, అధికారులు సద్వినియోగం చేసుకుంటే జిల్లాను అభివృద్ధి బాట పట్టించొచ్చునన్నారు. రాబోయే అయిదేళ్లలో ఏపీని దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టాలని సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారన్నారు. ఆయన స్ఫూర్తితో మన అందరం కూడా సత్యసాయి జిల్లాను రాష్ట్రంలో అగ్రపథాన నిలబెట్టడానికి కృషి చేద్దామని పిలుపునిచ్చారు. జిల్లా అభివృద్ధికి సమావేశానికి హాజరైన ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎంతో విలువైన సలహాలు అందజేశారని, వాటిన్నింటిని నమోదు చేసుకున్నామని, క్షేత్రస్థాయిలో కూడా కూర్చొని నియోజక వర్గాల వారీగా యాక్షన్ ప్లాన్ రూపొందించాలని సూచించారు. అధికారులు బాధ్యతతో పనిచేయాల్సిన అవసరం ఉందని మంత్రి సవిత స్పష్టం చేశారు.
కేంద్రం సహకారంతో చేనేత అభివృద్ధి
చేనేత కార్మికులకు అన్ని విధాలా అండగా నిలవాలని సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేశ్ చిత్తశుద్ధితో ఉన్నారని మంత్రి సవిత వెల్లడించారు. కొద్ది రోజుల కిందటే చేనేత రంగంపై సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారన్నారు. గత టీడీపీ ప్రభుత్వం మాదిరిగా నూలుపై సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించామన్నారు. చేనేతపై జీఎస్టీ మినహాయించాలని త్వరలో ఢిల్లీ వెళ్లి కేంద్రాన్ని కోరనున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం ముందుకు రాకపోయినా జీఎస్టీ భారం రాష్ట్ర ప్రభుత్వం మోయడానికి సిద్ధంగా ఉందన్నారు. చేనేతలకు మరింత ఆర్థిక దన్ను లభించేలా ట్రెండ్ కు తగ్గట్లుగా కొత్త డిజైన్లపై శిక్షణివ్వనున్నామన్నారు. అలా తయారు చేసిన వస్త్రాలకు మార్కెటింగ్ సదుపాయం కూడా రాష్ట్ర ప్రభుత్వమే కల్పించనుంది. త్వరలో సెల్లర్స్, బయ్యర్స్ సమావేశం కూడా ఏర్పాటు చేయబోతున్నామన్నారు. కలంకారీ వినియోగంపైనా చేనేతలకు శిక్షణిస్తున్నామన్నారు. ముఖ్యంగా ప్రకృతి సంబంధమైన రంగుల వినియోగంపై చేనేత కార్మికులకు శిక్షణ ఇస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఖాదీ బోర్డు ద్వారా రుణాలిచ్చే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టబోతున్నామన్నారు. త్వరలోనే నియోజక వర్గంలో ఖాదీ బోర్డు రుణాల సద్వినియోగంపై అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు మంత్రి వెల్లడించారు. అంతిమంగా నేతన్నలకు మేలు చేయాలన్నదే సీఎం చంద్రబాబునాయుడు కృతనిశ్చయంతో ఉన్నారని మంత్రి సవిత వెల్లడించారు.

 

Author

Was this helpful?

Thanks for your feedback!