
ప్రజా ప్రతినిధులను మర్యాదపూర్వకంగా కలిసిన పంచాయతీ కార్యదర్శులు
తుగ్గలి న్యూస్ వెలుగు ప్రతినిధి: తుగ్గలి మండల పరిధిలోని గల ఎంపీపీ ఎర్ర నాగప్ప ను,మాజీ ఎంపీపీ గురు స్వామి ను మరియు జొన్నగిరి గ్రామ సర్పంచ్ ఓబులేషు ను తుగ్గలి మండల పంచాయతీ కార్యదర్శులు నారాయణ స్వామి,రాజు నాయక్ లు సోమవారం రోజున మర్యాదపూర్వకంగా కలిసి శాలువాను కప్పి పూలమాలవేసి ఘనంగా సన్మానించారు.జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జొన్నగిరి గ్రామ పంచాయతీ కార్యదర్శిగా నారాయణ స్వామి,పగిడిరాయి గ్రామ పంచాయతీ కార్యదర్శి గా రాజు నాయక్ సోమవారం రోజున బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన పంచాయతీ కార్యదర్శులను గ్రామ ప్రజాప్రతినిధులు,సచివాలయ సిబ్బంది ఘనంగా సన్మానించి స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు బాలన్న,కొత్తూరు శివరాముడు,జొన్నగిరి విద్యా కమిటీ చైర్మన్ మిద్దె రవి,గ్రామ సచివాలయ సిబ్బంది,టిడిపి నాయకులు,కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.