విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తాం

విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తాం

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమానికి 132 ఫిర్యాదులు 

 ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన ఫిర్యాదుల పై త్వరితగతిన పరిష్కరించాలని పోలీసు అధికారులను ఆదేశించిన … జిల్లా ఎస్పీ

 దివ్యాంగుల వద్దకు వెళ్ళి ఫిర్యాదులను స్వీకరించి, న్యాయం చేస్తామని భరోసా కల్పించిన జిల్లా ఎస్పీ

కర్నూలు, న్యూస్ వెలుగు; కర్నూల్ కొత్తపేటలోని కర్నూల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్కన ఉన్న ఎస్పీ  క్యాంపు కార్యాలయంలో జిల్లా ఎస్పీ  జి. బిందు మాధవ్   సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం కు వచ్చిన ప్రజల సమస్యల వినతులను స్వీకరించి ఫిర్యాది దారులతో జిల్లా ఎస్పీ గారు మాట్లాడి వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి  మొత్తం 132 ఫిర్యాదులు వచ్చాయి.

కర్నూలు వెంకటరమణ కాలనీ కి చెందిన షేక్ సాదిక్, షేక్ తస్లీమా, గుంటూరు కు చెందిన రవి లు కలిసి మాకు బ్యాంక్ ఆఫ్ బరోడా లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ఫేక్ లెటర్స్ ఇచ్చి 5 మంది నుండి రూ. 30 లక్షలు తీసుకొని మోసం చేశారని కర్నూలు , బంగారు పేటకు చెందిన దివ్యాంగుడైన మురళీ మోహన్ ఫిర్యాదు చేశారు.

పెద్దల నుండి వంశపార్యం పరంగా వచ్చిన 3 ఎకరాల పొలాన్ని మా వదిన సరోజ , రిటైర్ట్ ఉద్యోగి రత్నస్వామి 3 సెంట్ల స్ధలాన్ని ఆక్రమించుకున్నారని అన్యాయం చేశారని నాకు పొలాన్ని, స్ధలాన్ని ఇప్పించే విధంగా న్యాయం చేయాలని గార్గేయపురం కు చెందిన దివ్యాంగుడైన దేవదానం ఫిర్యాదు చేశారు.

జూలై 31 న లొద్ది పల్లె హై స్కూల్ లో రికార్డు అసిస్టెంట్ గా పని చేస్తూ రిటైర్ అయ్యాను. గవర్నమెంట్ ఆర్డర్ కాపీ వచ్చింది. స్కూల్లో పని చేస్తున్న హెడ్ మాస్టర్ ఎమ్. విజయభాస్కర్ పెన్షన్ పత్రాల పై సంతకాలు చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నాడని కర్నూలు కు చెందిన రిటైర్ట్ ఉద్యోగి వెంకట రమణ రాజు ఫిర్యాదు చేశారు.

ప్రవేట్ గా చిట్ ఫండ్ పేరుతో చీటీలు వేసి 50 మంది బాధితుల నుండి కర్నూలు బాలాజీ నగర్ కు చెందిన తెలుగు నాగరాజు కుమారుడు దుర్గ ప్రసాద్ రూ. 10 కోట్ల మేర డబ్బులు తీసుకొని ఇవ్వడం లేదని కర్నూలు కు చెందిన బాధితులు సురేష్, అశోక్ , సునీల్ మరియు 12 మంది ఫిర్యాదు చేశారు.

మొబైల్ చూస్తుంటే ఇన్ స్టా గ్రాం లో ఆఫర్ వచ్చింది , తక్కువ రేటు కే డ్రస్సులు, వస్తువులు వస్తాయని చెప్పారు. నా బ్యాంకు ఎస్ బి ఐ క్రెడిట్ కార్డుతో అప్లై చేస్తూ ఉంటనే ఒక నిమిషంలోనే సైబర్ నేరగాళ్ళు నా బ్యాంకు ఖాతా నుండి రూ. 18,800 పోయాయని న్యాయం చేయాలని కర్నూలు కు చెందిన రిటైర్డ్ పోస్ట్ మాస్టర్ డేవిడ్ ఫిర్యాదు చేశారు.

కర్నూలు, ఆదోని, గుడూరు లలో గ్రూప్ – 4 ఉద్యోగాలు ఇప్పిస్తామని ముళ్ళ చాంద్ తాత మధ్యవర్తిత్వం చేసి మా ముగ్గురీ నుండి రూ. 20 లక్షలు తీసుకొని మధుసుధన్ అనే వ్యక్తి మోసం చేశాడని ఎమ్మిగనూరు , నందవరం కు చెందిన బాధితులు రాజు, వెంకప్ప, మురళీ ఫిర్యాదు చేశారు.

30 మంది డిస్ట్రిబ్యూటర్లతో కర్నూలు లో మసాలా వ్యాపారం చేస్తున్నాను. కంబం కు చెందిన మనోహర్ 8 నెలల పాటు కర్నూలు నుండి మసాలాలు కోనుగోలు చేస్తున్నాడు. కోనుగోలు చేసిన వాటికి రూ. 25 లక్షలు నా బ్యాంకు ఖాతాలో వేయకుండానే, డబ్బులు జమ చేసినట్టు ఫేక్ బ్యాంకు చలానా ను నాకు పంపించి డబ్బులు నా ఖాతా కు పంపించానని చెప్పి మోసం చేస్తున్నాడని కర్నూలు కు చెందిన వెంకన్న ఫిర్యాదు చేశారు.

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి, బాధితులకు న్యాయం చేస్తామని, సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని ఈ సంధర్భంగా కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందు మాధవ్ ఐపియస్ గారు హామీ ఇచ్చారు.

ఈ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ చల్లా కళ్యాణి , లీగల్ అడ్వైజర్ మల్లికార్జున రావు, సిఐ శివశంకర్ పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!