టీబీ.లేప్రాసి 2025 నాటికి పూర్తిగా అంతం చేయాలి
కర్నూలు, న్యూస్ వెలుగు; సోమవారం ఉదయం 10 గంటలకు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని ఓల్డ్ లెక్చరర్ గ్యాలరీ లో నోడల్ ఆఫీసర్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్ లకు ఒక్క రోజు శిక్షణ కార్యక్రమము నిర్వహించినారు ,ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్.ఎల్.భాస్కర్ మాట్లాడుతూ కుష్టు,టీబీ వ్యాధిగ్రస్తులను ప్రాథమిక దశలోనే గుర్తించి వారికి అవసరమైన చికిత్సను సకాలంలో అందించాలని తెలిపారు,. సుస్థిర అభివృద్ధి సాధనలో భాగంగా టీబీ.లేప్రాసి 2025 నాటికి పూర్తిగా అంతం చేయడం మనందరి పంతం అనే లక్ష్యంతో పనిచేయాలని,టీబీ,లేప్రాసి నివారణకు అందరూ బాధ్యతతో కృషి చేయాలని తెలిపారు. మీ పరిధిలోని కుష్టు వ్యాధిగ్రస్తులను ,క్షయ వ్యాధిగ్రస్తులను గుర్తించాలని, స్పర్శ లేని రాగి రంగు మచ్చలు ఉంటే వారికి పరీక్షలు చేయించాలని . కుష్టు కేసులను తొందరలోనే గుర్తించడం వలన అంగవైకల్యం నుండి రక్షించవచ్చునని అన్నారు, రెండు వారాలకు మించి దగ్గు, కఫంతో పాటు, రాత్రి పూట జ్వరం రావడము,బరువు తగ్గడము,ఆకలి మందగించడం వంటి లక్షణాలు ఉంటే నిర్ధారరణ పరీక్షలు చేయించాలని,ప్రజలలో కుష్టు,క్షయ వ్యాధి గురించి ప్రజలకు ఉన్న అనుమానాలు అపోహలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు.కేసులు అధికంగా నమోదు అవుతున్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు, క్షేత్ర స్తాయిలో మీరు బాధ్యయతంగా గాణాంకాలను నమోదు చేయాలని తెలిపారు.
డిస్ట్రిక్ట్ న్యూక్లియస్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్.మల్లికార్జున రెడ్డి గారు కుష్టు,టీబీ వ్యాధుల నివారణలో తీసుకోవలసిన చర్యలపై ఎల్‌సిడి ప్రొజెక్టర్ ద్వారా అవగాహన కల్పించినారు.
ఈ కార్యక్రమములో DPMO విజయ ప్రకాష్సు, బ్రమణ్యం, క్షయ కార్యాలయ సిబ్బంది ప్రొజెక్షనిస్ట్ ఖలీల్ పాల్గొన్నారు.