
జోహారాపురములో సయ్యద్ అల్లాబకష్ వలి ఉరుసు
కర్నూలు, న్యూస్ వెలుగు; నగరంలోని జోహారాపురం లో ఈ నెల 13-10-2024 ఆదివారము గంధము,14-10-2024 సోమవారము ఉరుసు (తట్టీలు ), 15-10-2024 మంగళవారము కిస్తీలు (జియారత్ )ఉరుసు మహోత్సవం జరుగుతుందని దర్గా ముత్తవలి(నిర్వాహకులు )సయ్యద్ అల్లాఉద్దీన్ షరీఫ్ పాషా తెలిపారు.ఈ సందర్బంగా నిర్వాహకులు సయ్యద్ అల్లా ఉద్దీన్ షరీఫ్ పాషా మాట్లాడుతూ జోహారాపురము గ్రామం లో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు కలిసి 3 రోజులు ఆనందంగా జరుపు కుంటారని, ఈ ఉరుసు కు జిల్లా నలుమూలలనుండి హాజరు అవుతారని చెప్పారు. గత 370 సంవత్సరాల నుండి ఈ ఉరుసు మహోత్సవం జరుగుతుందని, కావున భక్తులందరు ఉరుసు మహోత్సవం నకు హాజరై సయ్యద్ అల్లాబకష్ వలి దయకు పాత్రులై ప్రసాదం స్వీకరించి, జయప్రదం చేయవలెనని కోరారు.
Was this helpful?
Thanks for your feedback!
			

 Mahesh Goud Journalist
 Mahesh Goud Journalist