
విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయదశమి పండుగ
జిల్లా మంత్రులు, కలెక్టర్, ప్రజాప్రతినిధులు
నంద్యాల, న్యూస్ వెలుగు; చెడుపై మంచి, దుష్ట శక్తులపై దైవ శక్తుల విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయదశమి పండుగను జిల్లా ప్రజలంతా భక్తిశ్రద్ధలతో, ఆనందంగా జరుపుకోవాలని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ, న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, రోడ్లు భవనాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ మంత్రి బిసి జనార్దన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా, జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణాలు శుక్రవారం ఒక ప్రకటన ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. జాయింట్ కలెక్టర్ సి.విష్ణు చరణ్, నంద్యాల పార్లమెంట్ సభ్యులు బైరెడ్డి శబరి, ఎంఎల్సీలు, ఎమ్మెల్యేలు కూడ ప్రజలందరూ విజయదశమి పర్వదినాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
అమ్మల గన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ దుర్గమ్మతల్లి ఆశీస్సులతో జిల్లా ప్రజలంతా సుఖ శాంతులతో, సిరి సంపదలతో తులతూగాలని, ప్రతి ఒక్క కుటుంబానికి విజయాలు సిద్ధించడంతో పాటు నంద్యాల జిల్లా సమగ్ర అభివృద్ధి సాధించాలని వారు ఆ ప్రకటలో ఆకాంక్షించారు.


 Mahesh Goud Journalist
 Mahesh Goud Journalist