బంగారు దుకాణాలలో జ్యువెలరీ మెరుపులు
కళకళలాడుతున్న వాణిజ్య సంస్థలు కిటకిటలాడుతున్న వస్త్ర దుకాణాలు
ఆఫర్లతో ఆకర్షిస్తున్న వ్యాపారులు ఆన్లైన్లో కొనుగోల జోరు
ప్రొద్దుటూరు, న్యూస్ వెలుగు; ప్రొద్దుటూరు రెండవ ముంబాయి గా పేరుగాంచిన ప్రొద్దుటూరులో దసరా పండుగ సందడి నెలకొంది. ప్రజలు దసరా వేడుకలకు ఉత్సాహం చూపుతున్నారు. గతంలో సాదాసీదాగా సాగిన పండుగలతో వ్యాపార సంస్థలు వెలవెలబోయాయి. ప్రస్తుతం చిన్న తరహా వసర పరిశ్రమ కొనుగోళ్లతో సందడిగా మారాయి. ప్రొద్దుటూరు పట్టణంలో దసరా పండుగ సందర్భంగా రెడీమేడ్ దుకాణాలలో కొనుగోలు జోరుగా సాగుతున్నాయి.
కొనుగోలుదారుల ఆకర్షించడానికి ప్రత్యేక ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. గిఫ్ట్ ఆఫర్లు,డిస్కౌంట్లను అందిస్తున్నాయి. దసరా పండుగకు కొత్త బట్టలు కొనుగోలతో దుకాణాలు కిక్కిరిసిపోతున్నాయి. రెడీమేడ్,కిడ్స్ వేర్లలో సందడి నెలకొంది. పట్టణంలో బ్రాండెడ్ షోరూమ్ లో తోపాటు షాపింగ్ ప్రత్యేక ఆఫర్లు ప్రకటించాయి. దసరా తో మొదలవుతున్న పండుగలను పురస్కరించుకొని పట్టణంలో పలు భారీ షాపింగ్ మాల్స్ గెలిచాయి. గతంలో కడప,హైదరాబాద్, తదితర సుధీర ప్రాంతాలకు వెళ్లి కొత్త దుస్తులు కొనుగోలు చేసేవారు. ఈసారి స్థానికంగానే బ్రాండెడ్ షోరూమ్ లో అందుబాటులోకి రావడంతో ఇక్కడే కొనుగోలు చేస్తున్నారు. బ్రాండెడ్ షోరూమ్ల నిర్వహకులు లక్కీ, డిస్కౌంట్ లో ఆఫర్లు ఇస్తున్నారు. వినియోగదారులను ఆకర్షించడానికి ఇనిస్టెంట్ బహుమతులు కూడా ప్రకటిస్తున్నారు.
పండుగలకు అనుగుణంగానే అమెజాన్,ఫ్లిప్ కార్ట్, మైత్ర,టాటా, క్రియో వంటి సంస్థలు ఆన్లైన్లో ప్రత్యేక ఆఫర్లు ప్రకటించాయి. దీంతో జిల్లా వాసులు ఆన్లైన్లో కొనుగోలపై ఆసక్తి చూపుతున్నారు. ప్రధానంగా దుస్తులు మొబైల్స్, ఎలక్ట్రానిక్, వస్తువులు ఆన్లైన్లో కొనుగోలు చేస్తున్నారు. గతంలో పట్టణాలకే పరిమితమైన ఆన్లైన్ సౌకర్యం ఇప్పుడు జిల్లాలోని అన్ని మండలాలకు గ్రామాలకు విస్తరించింది. దీంతో ఆన్లైన్లో వస్తువులు కొనుగోలు పెరిగాయి. అంతేకాకుండా నచ్చని వస్తువులను వారం రోజుల్లో తిరిగి పంపించే అవకాశం ఉండడంతో మరింత ఆసక్తి పెరిగింది. ఎన్నో అందమైన ఆకర్షణ ఏమైనా ఇతర ఇమిటేషన్ నగలను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ప్రధానపత్రిక దుకాణాలు ఎన్నో వెలిశాయి దీంతో రోడ్లలో జనాలతో కిటికీలు లాడుతున్నాయి.