

Thanks for your feedback!
NEWER POSTవైభవంగా విజయదశమి వేడుకలు
OLDER POSTదేవరగట్టులో రక్త పట్టు
ఒంటిమిట్ట, న్యూస్ వెలుగు; దేవి శరన్నవరాత్రుల సందర్భంగా మండల కేంద్రమైన ఒంటిమిట్టలో వెలిసి ఉన్న అమ్మవారి శాలలో చివరి రోజు ఆదివారం ఆర్యవైశ్యుల నేతృత్వంలో మండల పురోహితులు, శ్రీ కోదండ రామాలయ ఆస్థాన పురోహితులు, అమ్మవారిశాల అర్చకులైన ఏలేశ్వరం. గురు స్వామి శర్మ ఆధ్వర్యంలో అదనపు అర్చకులు ఏలేశ్వరం. బాల గురునాథ శర్మ, ఏలేశ్వరం. గురు దీక్షిత్ శర్మ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాతకు ప్రత్యేకంగా పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అర్చకులు వాసవి మాత మూలవిరాట్టుకు శ్రీ సూక్త, పురుష సూక్త ప్రకారంగా పంచామృత అభిషేకాలు నిర్వహించి కనక భూషణ పుష్పతరువులతో దేదీప్యమానంగా అలంకరించడం జరిగింది. అనంతరం ఆర్య వైశ్యులు భక్తిశ్రద్ధలతో అత్యంత కోలాహలంగా వసంతోత్సవం సందర్భంగా ఒకరినొకరు వసంతాలు పోసుకుంటూ రంగులు పూసుకుంటూ అమ్మవారి గ్రామోత్సవాన్ని నిర్వహించారు. ఈ అమ్మవారి ఉత్సవంలో ఆర్యవైశ్యులే కాకుండా పుర ప్రజలు భక్తిశ్రద్ధలతో పాల్గొని యధావిధిగా టెంకాయ, కర్పూరం సమర్పించి తమ మొక్కులను తీర్చుకున్నారు. సాయంత్రం డోలాదిరోహణ అలంకారంలో జగన్మాత ఆలయానికి వచ్చిన భక్తులకు దర్శన భాగ్యాలు కల్పించింది.