మద్యం షాపులు ఆలయానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేయాలి

మద్యం షాపులు ఆలయానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేయాలి

ఒంటిమిట్ట, న్యూస్ వెలుగు;  మండల కేంద్రమైన ఒంటిమిట్టలో ఏర్పాటు చేస్తున్న మద్యం షాపులు శ్రీ కోదండ రామాలయానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేసే విధంగా ఎక్సైజ్ ఉన్నతాధికారులు షాప్ యజమానులకు ఆదేశాలు జారీ చేయాలని ఒంటిమిట్ట మండల తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి కొత్తపల్లె .బొబ్బిలి రాయుడు సోమవారం ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో అన్నారు. ఈ సందర్భంగా ఆయన సమావేశంలో మాట్లాడుతూ రెండవ అయోధ్యగా ఆంధ్ర భద్రాచలం ఏకశిలానగరం ఒంటిమిట్టగా శ్రీ కోదండ రామాలయం చరిత్రలోకి ఎక్కిందని రామాలయము అతి పురాతన చరిత్ర కలిగిన ఆలయముగా పేరు ప్రతిష్టలు సంపాదించుకొని తిరుమల తిరుపతి దేవస్థాన పర్యవేక్షణలో బాసిల్లుతోందని సాక్షాత్తు శ్రీ కోదండరామస్వామి త్రేతాయుగంలో సతీ సోదర సమేతంగా ఈ ప్రాంతంలో సంచరించాడన్న సాక్షాలు ప్రతి ఒక్కరికి సాక్షిభూతంగా నిలుస్తున్నాయని అటువంటి పరమ పావనమైన ఒంటిమిట్ట అనడి పుణ్యక్షేత్రంలో మద్యం షాపులు నెలకొల్పడం సమంజసం కాదని అన్నాడు. ప్రధానంగా ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయం తెలుగు రాష్ట్రాల్లో ఒక గుర్తింపు సంపాదించుకుందని భారతదేశంలోని ప్రాచీన కోదండ రామాలయాల కట్టడాల్లో ఒంటిమిట్ట కోదండ రామాలయం సైతం గుర్తింపు సాధించిందన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలే కాకుండా తమిళనాడు, కేరళ ,మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, రాష్ట్రాల ప్రజలే కాకుండా పరదేశీయులు కూడా కోదండ రామస్వామి దర్శనార్థం ఒంటిమిట్టకు వస్తున్న నేపథ్యాలు కలిగి ఉన్నాయని అంతటి గుర్తింపు పొందిన కోదండరామస్వామి సన్నిధిలో బ్రాందీ షాపులు ఏర్పాటు చేసినట్లయితే మాయని మచ్చ ఏర్పడుతుందని భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని వాటిని దృష్టిలో పెట్టుకుని ఒంటిమిట్టలో ఏర్పాటు చేసే బ్రాందీ షాపులను రెండు కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేసే విధంగా ఉన్నతాధికారులు తగు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా. చంద్రబాబు నాయుడుకు, ఉపముఖ్యమంత్రి కొణిదల. పవన్ కళ్యాణ్ కు దేవాదాయ శాఖ మంత్రికి వినతి పత్రాలను సమర్పించడం జరిగిందని అన్నారు. కడప చెన్నై ప్రధాన రహదారిలో శ్రీ కోదండరామ స్వామి ఆలయం ఒంటిమిట్ట ఉండడంతో భక్తజన సమూహానికి మందుబాబుల వల్ల ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవలసిన బాధ్యత అధిష్టానానికి ఎక్సైజ్ అధికారులకు ఎంతైనా ఉందన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!