గ్రామాల అభివృద్ధి ప్రభుత్వ ధ్యేయం ; ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి
బండి ఆత్మకూరు న్యూస్ వెలుగు: గ్రామాల అభివృద్ధి ప్రభుత్వ ధ్యేయమని శ్రీశైల నియోజకవర్గం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని నారాయణపురం లింగాపురం ఈర్నపాడు బి. కోడూరు గ్రామాలలో ఎమ్మెల్యే పర్యటించి.పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాలు కార్యక్రమంలను ప్రారంభించారు.అనంతరం నారాయపురం గ్రామంలో 18 లక్షల వ్యయంతో నూతన సిమెంటు రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు. లింగాపురం గ్రామంలో కోటి రూపాయల వ్యయంతో నూతన సిమెంట్ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ. బి.కోడూరు గ్రామంలో 21.50 లక్షలతో నూతన సిమెంట్ రోడ్ నిర్మాణానికి భూమి పూజ. ఈర్నపాడు గ్రామంలో 25 లక్షల వ్యయంతో సిమెంట్ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసి అనంతరం ఆయా గ్రామాల్లో శిలాఫలకాలు ప్రారంభించారు. అనంతరం బి కోడూరు గ్రామంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎనర్జీఎస్ ద్వారా ప్రతి నియోజకవర్గానికి 20 కోట్ల వ్యయంతో గ్రామాల అభివృద్ధి కోసం కేటాయించారన్నారు. బండిఆత్మకూరు మండలంలో3 కోట్ల 73 లక్షల వ్యయంతో సిసి రోడ్ల నిర్మాణం చేపడుతున్న మన్నారు. గత 5 సంవత్సరాల కాలంలో వైసిపి అధికారంలో రాష్ట్ర అధోగతి పాలు అయిందన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజుల్లోనే ఇంత అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఎన్డీఏ కూటమి తో రాష్ట్రంలో ప్రజలు సుభిక్షంగా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు నరసింహారెడ్డి టిడిపి నాయకులు భరద్వాజ శర్మ, మనోహర్ రెడ్డి,సుధాకర్ రెడ్డి బాలు,లింగాపురంపరశురాం రెడ్డి ,షేక్ బాబు, హేమ సుందర్ రెడ్డి, చలమయ్య, అంకిరెడ్డి, మల్లేష్ యాదవ్, వెంగల్ రేడ్డిపేట శ్రీనివాసులు యలగల తిరుపాలు, మోక్షేశ్వర్ రెడ్డి, టిడిపి నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.