17న గరుడోత్సవ సేవ; ఈఓ వీరయ్య
మద్దికేర న్యూస్ వెలుగు ప్రతినిధి: మద్దికేర మండలం పెరవలి గ్రామంలో వెలసిన శ్రీభూదేవి శ్రీరాజ్యలక్ష్మి సమేత శ్రీ రంగనాథస్వామి వారికి ఈ నెల 17వ తేదిన గరుడ వాహన సేవ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వాహనాధికారి వీరయ్య తెలిపారు.మంగళవారం ఆయన మాట్లాడుతూ గురువారం ఆశ్వియుజ శుద్ధ పౌర్ణమి సందర్బంగా ఆలయ అర్చకులు కోమండూరి రంగనాథాచార్యులు బృందం వేకువ ఝాముననే శ్రీభూదేవి శ్రీరాజ్యలక్ష్మి సమేత శ్రీరంగనాథస్వామి వారి మూల మూర్థులకు పంచాంభృత అభిషేకాదులు నిర్వహించి,నూతన పట్టువస్త్రాలు,దివ్యాభారణాలు ధరింపజేసి,వివిధ రకాల పూలమాలలతో సుందరంగా అలంకరించి,ప్రత్యేక అర్చనలు,మహా పూజలు నిర్వహిస్తారని ఆయన తెలిపారు.సాయంత్రం శ్రీ భూదేవి శ్రీ రాజ్యలక్ష్మి సమేత శ్రీ రంగనాథస్వామి వారి ఉత్సవ మూర్తులను గరుడవాహనంపై వేంజేసి ఆలయ ప్రాంగణంలొ ప్రాకారోత్సవం నిర్వహిస్తారని ఆయన తెలిపారు.కనుక భక్తులందరు కుటుంబ సమేతంగా ఆలయానికి విచ్చేసి,శ్రీ భూదేవి శ్రీ రాజ్యలక్ష్మి సమేత శ్రీ రంగనాథస్వామి వారిని దర్శించుకొని,తీర్థప్రసాదములు స్వీకరించి,స్వామి వారి ఆశీస్సులు పొందాలని ఈవో వీరయ్య తెలియజేశారు.