హోళగుంద,న్యూస్ వెలుగు: జాతీయ ఉపాధి హామీ పథకం నిధులతో పల్లెల్లోని

కాలనీలను సర్వతోముకాభివృద్ధి చేసుకుందామని,ఈ పథకం గ్రామ అభివృద్ధికి వరంలాంటిదని ఎంపీడీఓ విజయ లలిత పేర్కొన్నారు.గురువారం మండల పరిధిలోని హెబ్బటం గ్రామ పంచాయతీ నందు సర్పంచ్ కృష్ణవేణి అధ్యక్షతన కార్యదర్శి రాజశేఖర్ ఆధ్వర్యంలో పల్లె పండుగ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న పల్లె పండుగ కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాలలో ప్రగతి పరుగులు తీస్తుందని తెలిపారు.అలాగే పర్యావరణ పరంగా గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించి,పల్లెల సర్వతోముకాభివృద్ధికి బాటలు వేయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశమని చెప్పారు.ఈ కార్యక్రమంలో ఎపీఓ భక్తవత్సలం,నాయకులు నరసప్ప,మాజీ జడ్పీటిసి అయ్యాలప్ప,దేవిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Thanks for your feedback!