బంగారు పథకాలు సాధించిన ఆర్. దీవన్ కుమార్ ను అభినందించిన కలెక్టర్

బంగారు పథకాలు సాధించిన ఆర్. దీవన్ కుమార్ ను అభినందించిన కలెక్టర్

కర్నూలు, న్యూస్ వెలుగు; కర్నూలు కేంద్రీయ విద్యాలయానికి చెందిన ఆర్. దీవన్ కుమార్ కర్నూలు జిల్లా స్పోర్ట్స్ అథారిటీ అవుట్డోర్ స్టేడియం నందు గత మూడు సంవత్సరాల నుండి పరుగు పందెం ప్రాక్టీస్ చేసుకుంటూ ఉన్నారు . ఆర్ .దీవన్ కుమార్ ఈ నెల అక్టోబర్ 5 నుండి 9 వరకు కేరళ రాష్ట్ర రాజధాని త్రివేండ్రం లో జరిగిన 53వ కేంద్రీయ విద్యాలయ స్పోర్ట్స్ మీట్ లో పాల్గొని 400 మీటర్ల పరుగు పందెంలో బంగారు పతకం ను, 400 మీటర్ల హర్డిల్స్ పరుగు పందెం లో కూడా బంగారు పతకము సాధించారు. బంగారు పథకాలు సాధించి నందున జాతీయస్థాయిలో జార్ఖండ్ రాష్ట్రంలో రాంచీ నందు నవంబర్ 25 నుండి 28 వరకు జరిగే స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లో జరిగే క్రీడలలో పాల్గొనడానికి ఆర్. దీవన్ కుమార్ అర్హత సాధించడం జరిగిందని కర్నూలు జిల్లా క్రీడల అధికారి భూపతి రావు జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా కు తెలియజేశారు

ఈ విధంగా 400 మీటర్ల సాధారణ పరుగు పందెంలో, 400 మీటర్ల హర్డిల్స్ పరుగు పందెం ల లో 2 బంగారు పథకాలు సాధించిన ఆర్. దీవన్ కుమార్ ను జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా క్యాంపు కార్యాలయంలో అభినందించారు.

కర్నూలు జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి భూపతి రావు ,కర్నూలు కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపాల్ పాయల్ ప్రియాంక దర్శన్, కోచ్ కె.హారిక (ఈనాడు లక్ష్య కోచ్ ) క్రీడాకారుడు దీవన్ కుమార్ ను కలెక్టర్ కు పరిచయం చేశారు. ఈ సమావేశానికి జీవన్ కుమార్ అమ్మ గారు కూడా హాజరయ్యారు.

Author

Was this helpful?

Thanks for your feedback!