ఒంటిమిట్ట, న్యూస్ వెలుగు: ఒంటిమిట్ట మండలం చెర్లోపల్లి గ్రామంలో మండల


పురోహితులు, కోదండ రామాలయం ఆస్థాన పురోహితుడు అయిన ఏలేశ్వరం .గురుస్వామి శర్మ సారధ్యంలో ఆ గ్రామస్తుల ఆధ్వర్యంలో శుక్రవారం అత్యంత వైభవోపేతంగా వేద పండితులు శ్రీ హనుమత్ సమేత సీతారామ లక్ష్మణ విగ్రహ ప్రతిష్ట మహోత్సవము నిర్వహించడం జరిగింది. ముందుగా బుధవారం రోజు పంచపాలక, నవగ్రహ, అష్టదిక్పాలక, హనుమత్ సీత రామ లక్ష్మణ ప్రధాన కలశ స్థాపన, మహా గణపతి పూజ, స్వస్తి పుణ్యా వాచనం, రుత్వికరణము, సాయంత్రము వాస్తు, నవగ్రహ హోమం, విగ్రహ జలాధివాసము, నివేదన, మంగళహారతి, మంత్రపుష్పము, గురువారం ఉదయం మూలవిరాట్యులకు 101 కలశాలతో మహాస్నపనము, పంచామృత అభిషేకాలు, విగ్రహ నూతన వస్త్రధారణ, గ్రామోత్సవము, సాయంత్రం నవగ్రహ హోమం, విగ్రహ ధాన్యాధివాసము, మహా నివేదన, మంగళ హారతి, మంత్రపుష్పం శుక్రవారం ఉదయం విగ్రహ, షోడశోపచార పూజా కార్యక్రమాలు, శ్రీ మహాగణపతి సమేత హనుమత్ సీత రామ లక్ష్మణ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం, పూర్ణాహుతి నిర్వహించారు. ఈ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి రాజంపేట శాసనసభ్యులు ఆకేపాటి. అమర్నాథ్ రెడ్డి, మండల వైసీపీ సీనియర్ నాయకుడు ఆకేపాటి .వేణుగోపాల్ రెడ్డి గ్రామస్తుల ఆహ్వానం మేరకు ఆహ్వానితులై పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామస్తులు వారికి స్వాగతం పలికి ఆహ్వానించారు. అనంతరం వారికి మండల పురోహితులు ఏలేశ్వరం. గురుస్వామి శర్మ పూజా కార్యక్రమాలు నిర్వహించి శాలవా, పూలమాలతో వేద ఆశీర్వచనంతో సత్కరించడం జరిగింది. అనంతరం శ్రీ సీతారామ కళ్యాణాన్ని అర్చకులు గ్రామస్తుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రతిష్టా కార్యక్రమానికి వచ్చిన బంధు గణాలకు గ్రామస్తులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సీతారామ కళ్యాణం లో సర్వులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ఏదేమైనప్పటికీ చెర్లోపల్లి గ్రామంలో శ్రీ కోదండరామ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగిందని చెప్పాలి.
-
Y.Bala guru natha sarma , Vontimitta kadapa District devotional writings
View all posts
Thanks for your feedback!