ప్రమాదానికి కారణమైన వారిపై కేసులు నమోదు చేయాలి
డోన్, న్యూస్ వెలుగు; డోన్ లోని మోడల్ స్కూల్లో బస్సు ప్రమాదంలో గాయపడిన విద్యార్థులను కర్నూల్లోని ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారిని ఎన్ ఎస్ యు ఐ నాయకులు తెలుగు విజయ్ కుమార్ పరామర్శించడం జరిగింది..విద్యార్థుల బాగోగులను గురించి విచారించిన వారు కోలుకునే దానికి 6 నుంచి 8 నెలలు పడుతుందని వైద్యులు చెప్పారని అయితే విద్యార్థులకు భవిష్యత్తులో కూడా గాయాల వల్ల ఇబ్బందులు రావచ్చని దీని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వారు ఈ విద్యార్థులకు 50 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు..అనంతరం వారు మాట్లాడుతూ డిపో మేనేజర్ గారు బస్సులో కండక్టర్ లేకుండా బస్సులో కేటాయించిన సీట్ల కంటే ఎక్కువ మంది విద్యార్థులను తీసుకెళ్తున్న పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల , బస్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల , స్కూల్ ప్రిన్సిపల్ విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగ వహించడం వలననే ఈ ప్రమాదం జరిగిందని దీనికి ఈ ముగ్గురే పూర్తి బాధ్యత వహించాలని వారు డిమాండ్ చేశారు..ఈ ప్రమాదానికి సంబంధించి ఉన్నతాధికారులను కలిసి ప్రమాదానికి కారణమైన ప్రతి ఒక్కరిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకునే విధంగా , విద్యార్థులకు న్యాయం జరిగేంతవరకు పోరాడుతామని వారు తెలిపారు.