
ఇచ్చిన హామీలు నెరవేర్చిన తర్వాతే పల్లె పండుగ జరుపుకోవాలి
వైయస్సార్సీపి రాష్ట్ర ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి ఉప్పలపాటి యోబు
జమ్మలమడుగు టౌన్, న్యూస్ వెలుగు; ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు నాలుగు నెలలు అయినా ఇచ్చిన హామీలపై ఎలాంటి దృష్టి పెట్టకుండా ప్రజలను మభ్య పెట్టడానికి పల్లె పండుగ కార్యక్రమాన్ని జరుపుకోవడం చాలా దారుణమైన విషయమని వైఎస్ఆర్సిపి రాష్ట్ర ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి ఉప్పలపాటి యోబు ప్రభుత్వాన్ని విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీరు ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాల్లో..1. తల్లికి వందనం కింద 15000, 2. అన్నదాత సుఖీభవ కింద రైతులకు 20 వేల రూపాయలు, 3. నిరుద్యోగ భృతి యువకులకు
4. మహిళలకు బస్సులలో ఉచిత ప్రయాణము, 5. ఉచిత గ్యాస్ సిలిండర్లు మంజూరు
6. 19 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల వయసుగల మహిళలకు ప్రతినెల 1500 రూపాయలు ఇవ్వవలసినటువంటి ఈ పథకాలను మరుగున పడడానికి నేడు సూపర్ సిక్స్ పాలసీలను అమలు చేయిస్తాం అనడం ప్రజలను మోసం చేయడం కాదా
ఈ కూటమి ప్రభుత్వం వెంటనే సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయాలి కానీ, సూపర్ సిక్స్ పాలసీలను తీసుకురావడం మోసపూరితంగా ఉంది. కావున ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వ సీఎం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు. వెంటనే మీరు చేయవలసినటువంటి మిగిలిన 5 పథకాల గురించి ఆలోచన చేయాలి గాని మరియొక సూపర్ సిక్స్ పథకాలను చేస్తామనడం డైవర్ట్ పాలిటిక్స్ కిందికి వస్తుంది.వెంటనే సూపర్ సిక్స్ కు కావలసినటువంటి పూర్తి బడ్జెట్ను ప్రవేశపెట్టి ఈ పథకాలను అమలు చేసినప్పుడు మాత్రమే ప్రజలు ఆశీర్వదిస్తారు. అని ఆయన తెలిపారు.


 Ponnathota Jayachandra
 Ponnathota Jayachandra