
బీటీ రోడ్డు శంకుస్థాపనకు రానున్న బి వీరభద్ర గౌడ
హొళగుంద, న్యూస్ వెలుగు; హోళగుంద నుండి హాన్నూర్ కొట్టాల వరకు నాలుగు కోట్ల 70 లక్షల రూపాయల తో నిర్మించే కొత్త బీటీ రోడ్డు శంకుస్థాపనకు ఆలూరు నియోజకవర్గం టిడిపి ఇన్చార్జ్ వర్యులు శ్రీ బి వీరభద్ర గౌడ హాజరవుతున్నారు. సంబంధిత అధికారులు కూడా హాజరవుతున్నారని అలాగే మండలంలోని టిడిపి నాయకులు, కార్యకర్తలు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, బిజెపి పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరవుతున్న సందర్భంగా 11 గంటలకు రోడ్డు నిర్మాణ శంకుస్థాపన పనులు హోన్నుర్ కొట్టాల శ్రీరాములు దేవస్థానం దగ్గర ఉంటుందని టిడిపి యువ నాయకులు మిక్కిలి నేని వెంకట శివప్రసాద్పడాలి వేణుగోపాలరావు, హొన్నూరు కొట్టాల టిడిపి గ్రామ కమిటీ నాయకులు తెలిపారు.
Was this helpful?
Thanks for your feedback!
			

 Journalist M. Mahesh Gouda
 Journalist M. Mahesh Gouda