పల్లెల అభివృద్ధి కూటమి ప్రభుత్వ ధ్యేయం

పల్లెల అభివృద్ధి కూటమి ప్రభుత్వ ధ్యేయం

*హోన్నూరు క్యాంపు బిటి రోడ్డు నిర్మాణానికి భూమి పూజ.
*4 కోట్ల 70 లక్షలతో రోడ్డు నిర్మాణ పనులు.
*ఆలూరు టీడీపి ఇంచార్జీ వీరభద్ర గౌడ.
హోళగుంద, న్యూస్ వెలుగు: మండల పరిధిలోని హోన్నూరు క్యాంపు నందు బిటి రోడ్డు నిర్మాణ పనులకు ఆదివారం ఆలూరు తాలూకా టిడిపి ఇంచార్జీ వీరభద్ర గౌడ పార్టీ నాయకులు,కార్యకర్తలతో కలిసి భూమి పూజ చేశారు.ముందుగా స్థానిక నాయకులు పెద్ద ఎత్తున టపాసులు కాల్చి పూలమాలలు వేసి ఘన స్వాగతం పలికారు.అనంతరం శ్రీ రామ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హొన్నూరు క్యాంపు నుంచి హోళగుంద ఎలెల్సి కెనాల్ వరకు రూ.4 కోట్ల 70 లక్షల నిధులు మంజురైయ్యాయని తెలిపారు.ముఖ్యమంత్రి,ఉప ముఖ్యమంత్రి,జిల్లా కలెక్టర్ సహకారంతో రహదారి నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు.ప్రభుత్వం వంద శాతం సబ్సిడీతో గోకుల షెడులు నిర్మాణం చేపడుతుందని కావున ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.గత ప్రభుత్వం 5 ఏళ్ళల్లో అభివృద్ధి చేసిందేమీ లేదన్నారు.మరియు 2014-2019 వరకు ఆలూరు తాలూకా ఇంచార్జీ గా ఉన్న సందర్భంలో వేదవతి ప్రాజెక్టు నిర్మాణం కోసం రూ.1982 కోట్లు నిధులు మంజూరు చేశారు.అయితే గత ప్రభుత్వం కేవలం రూ.150 కోట్లు పనులు చేసి ప్రాజెక్టును నిర్వీర్యం చేసిందన్నారు.ఈ ప్రాజెట్ పూర్తి అయితే 80 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అతి తక్కువ సమయంలో గ్రామాల్లో పూర్తిస్థాయిలో సిమెంట్ రోడ్లు,బిటి రోడ్లు వేసినందుకు కృషి చేసిందని తెలిపారు.మరియు ప్రతి మారుమూల గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని,ఇందులో భాగంగా పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా గ్రామ ప్రజల నిర్ణయాన్ని తీసుకొని రోడ్లు లేని గ్రామాలను ఎంచుకొని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని ఆయన తెలిపారు.అదేవిధంగా కూటమి ప్రభుత్వంలోన నాయకులు కార్యకర్తలు కలిసి గ్రామాభివృద్ధి కోసం కృషి చేయాలని తెలియజేశారు. రోడ్డు పనులు సుగుణ కంపెనీ కన్స్ట్రక్షన్ ఎండి యోగేష్ రెడ్డి చేస్తారన్నారుఈ కార్యక్రమంలో పిఆర్డిఈ మనోహర్,పీఆర్ఏఈ యామునప్ప,ఎపిఒ భక్తవత్సలం,ఎస్ఐ బాల నరసింహులు,మిక్కిలినేని ప్రసాద్,రాజా పంపన్న గౌడ,బిజెపి మండల అధ్యక్షులు ప్రసాద్,ఎర్రి స్వామి,కాడ సిద్దప్ప,పంపాపతి,దిడ్డి వెంకటేష్,సూరన్న,దుర్గయ్య, గాదిలింగ,మల్లికార్జున,రమేష్ రెడ్డి,శేషన్న,జయప్ప గౌడ,అయ్యప్ప,రాఘవేంద్ర,బుడగ జంగాల రామంజినీ,లక్ష్మణ,సీతయ్య,దర్గన్న,మోహిన్,అతరహిమన్,సర్దార్,చగప్ప,మధుసూదన్ రెడ్డి,తోక వెంకటేష్,గాదిలింగ,వీరేశ్,కూటమి పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!