సమాచార హక్కు చట్టం పై అవగాహన సదస్సు

సమాచార హక్కు చట్టం పై అవగాహన సదస్సు

హోళగుంద,న్యూస్ వెలుగు: మండల కేంద్రంలో సోమవారం స్థానిక వ్యవసాయ అధికారి కార్యాలయంలో ఏఓ ఆనంద్ లోకదళ్ రైతు సేవా కేంద్రం సిబ్బందికి సమాచార హక్కు చట్టం పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2005(1)(బి) సమాచార హక్కు చట్టం ప్రకారం ప్రభుత్వ శాఖ పరిధిలోని ప్రతి సమాచారాన్ని రాత పూర్వకంగా ప్రజలు ఎవరైనా అడిగే హక్కు ఉందని  ఆయా సమాచారాన్ని 30 రోజుల వ్యవధిలో అందించడం జరుగుతుందన్నారు.అంతేకాకుండా నిర్ణీత సమయంలో సమాచారం అందించకపోతే ఉన్నతాధికారికి అప్పీల్ చేసుకోవచ్చని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఏఈఓ వీరూపాక్షీ,ఎంపిఈఓ నరసింహులు,అన్ని గ్రామాల రైతు సేవా కేంద్రం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!