
భూ రీ సర్వే సమస్యల పరిష్కారానికే గ్రామ సభ
కర్నూలు, న్యూస్ వెలుగు: రైతులకు చెందిన భూములను రీ సర్వే చేశారని వాటిలో సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామని కల్లూరు మండల తహసిల్దార్ ఆంజనేయులు తెలిపారు. మంగళవారం కల్లూరు మండల పరిధిలోని బొల్లవరం గ్రామoలో భూ రీ సర్వే సమస్యలపై గ్రామసభ నిర్వహించారు.ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ 2023లో రైతుల భూములను భూ రీ సర్వే పూర్తి చేయడం జరిగిందని తెలిపారు.ఎలాంటి అవగాహన లేని ఇతర గ్రామాల సర్వేయర్లతో ఇష్టానుసారంగా సర్వే చేయడం వల్ల ఎక్కువగా రైతులకు ఎల్పీ నంబర్ల సమస్య ఏర్పడిందన్నారు. రైతులు కూడా పొలాల దగ్గర లేకపోవడం వల్ల ఈ సమస్య వచ్చిందన్నారు.గ్రామసభను రైతులు ఉపయోగించుకోకపోతే వాళ్ల సమస్యలను పరిష్కరించలేమన్నారు. అయితే భూ రీ సర్వేలో వచ్చిన భూ సమస్యల పరిష్కారానికి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గ్రామ సభ నిర్వహిస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ గైరాజరయ్యారు. మండల సర్వేయర్ శ్రీనివాసులు, గ్రామ సర్వేయర్ పురుషోత్తం, విఆర్ఓలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.


 Mahesh Goud Journalist
 Mahesh Goud Journalist