కస్తూర్బా పాఠశాల రోడ్డు వెంట వెలగని వీధి దీపాలు..
రాత్రి వేళలో అవస్థలు పడుతున్న కస్తూర్బాపాఠశాల, విద్యార్థుల తల్లిదండ్రులు సిబ్బంది..
బండి ఆత్మకూరు న్యూస్ వెలుగు: మండల కేంద్రమైన బండి ఆత్మకూరులోని కస్తూరిబా పాఠశాలకు వెళ్లాలంటే రాత్రి వేళల్లో చాలా భయంగా ఉందని కస్తూర్బా పాఠశాల సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలకు వెళ్లే దారిలో రోడ్డుపై నుండి పాఠశాల వరకు దాదాపు 4 స్తంభాలు ఉన్నాయి. ఏ ఒక్క స్తంభానికి ఉన్న వీధిలైటు కూడా వెలగడం లేదు. దీనితో రాత్రి వేళలో ఏదైనా అత్యవసరమైతే బయటికి రావాలంటే భయంగా ఉందని పాఠశాల సిబ్బంది తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.ఈ విషయంపై పలుమార్లు అధికారులకు తెలియజేసిన పట్టించుకున్న దాఖలాలు లేవని పాఠశాల సిబ్బంది ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా కస్తూరిబా పాఠశాలకు వెళ్లే దారిలో వీధిలైట్లు వెలిగేలా చూడాలని పాఠశాల సిబ్బంది తల్లిదండ్రులు కోరుతున్నారు
Was this helpful?
Thanks for your feedback!