
రూ. 25 లక్షల అభివృద్ధి పనులు ప్రారంభం
తుగ్గలి న్యూస్ వెలుగు ప్రతినిధి: మండల కేంద్రమైన తుగ్గలి లో రూ 25 లక్షల తో నిర్మించిన సిమెంట్ రోడ్లను ఎమ్మెల్యే కే ఈ శ్యామ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా తుగ్గలికి వచ్చిన ఎమ్మెల్యే కే ఈ శ్యామ్ కుమార్ కు టిడిపి రాష్ట్ర కార్యనిర్వహణ రాష్ట్ర కార్యదర్శి, శాలివాహన ఫెడరేషన్ రాష్ట్ర మాజీ చైర్మన్ తుగ్గలి నాగేంద్ర, మాజీ జెడ్పిటిసి వరలక్ష్మి, సర్పంచు రవి లు బాణాసంచి కాల్చుతూ మేల తాళాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం గజమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కే ఈ శ్యామ్ కుమార్ మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని గ్రామాల లో పండగ కళ వచ్చిందన్నారు. రాష్ట్రంలోనే అన్ని గ్రామాల లో 4,500 కోట్ల రూపాయల తో 30 వేల అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందన్నారు.రూ 3 వేలు గా ఉన్న పింఛన్ ను రూ 4 వేలు కు పెంచి, ఇంటి వద్దనే పింఛన్ లబ్ధిదారుల కు ఇవ్వడం జరుగుతుందన్నారు. అన్ని గ్రామాలలో మౌలిక వసతులను కల్పించేందుకు ప్రభుత్వం ముందుకు పోతుందన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యనిర్వహణ రాష్ట్ర కార్యదర్శి తుగ్గలి నాగేంద్ర, మాజీ జెడ్పిటిసి వరలక్ష్మి, మాజీ వైస్ ఎంపీపీ విజయభాస్కర్, సర్పంచ్ రవి, తదితరులు పాల్గొన్నారు.