
ఉచిత ఆధార్ కేంద్రం గడువును పొడిగించాలి
హోళగుంద, న్యూస్ వెలుగు: మండలంలో ఏర్పాటు చేసిన ఉచిత ఆధార్ కేంద్రం గడువులు పొడిగించాలని శుక్రవారం టిడిపి సీనియర్ నాయకులు గాలి వీరభద్ర గౌడ ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొద్దిరోజుల వరకే ఆధార్ క్యాంపులు నిర్వహించడం వల్ల ప్రజలకు సమాచారం కరువై ఆధార్ కేంద్రాలను సద్వినియోగం చేసుకోలేకపోతున్నారన్నారు.అలాగే వ్యవసాయ సీజన్ ప్రారంభమైనందున ప్రజలు ఎక్కువగా పొలాల్లో ఉంటున్నారని ప్రజలకు మెరుగైన ఆధార్ సౌకర్యం పొందడానికి జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకుని పది రోజుల వరకు ఆధార్ కేంద్రాల గడువు పెంచాలన్నారు.అంతేకాకుండా ఆధార్ క్యాంపు వద్ద సర్వర్ సమస్యల వల్ల ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని చెప్పారు.కావున జిలాధికారులు చర్యలు తీసుకుని ఆధార్ ఉచిత క్యాంపు కార్యక్రమం గడువును పెంచి ప్రజా సమస్యలు సులభంగా పరిష్కారం అయ్యేలా చూడాలని తెలియజేశారు.


 Journalist M. Mahesh Gouda
 Journalist M. Mahesh Gouda