
రైతుల సమస్యల పరిష్కారానికి గ్రామసభలు
బండి ఆత్మకూరు, న్యూస్ వెలుగు; గ్రామాల్లో భూ సమస్యలు పరిష్కరించేందుకే గ్రామ సభలు నిర్వహిస్తున్నామని బండి ఆత్మకూరు తాసిల్దార్ ధోని ఆల్ఫ్రెడ్ అన్నారు. మండలంలోని శనివారం నారాయణపురం చిన్నదేవలాపురం గ్రామాలలో గ్రామసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా తాసిల్దార్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో భూ రీసర్వేలో జరిగిన పొరపాట్లను సవరించేందుకే గ్రామ సభలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. నారాయణపురం చిన్నదేవలాపురం గ్రామాలలో 82 అర్జీలు వచ్చాయని తెలిపారు. పట్టాదారు పేరు నమోదుకు28 అర్జీలు విస్తీర్ణం సవరణకు 32 అర్జీలు కరెక్షన్స్ సవరణకు 2 అర్జీలు జాయింట్ ఎల్ పి యమ్ సవరణకు 20 అర్జీలు వచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో మండల సర్వేయర్ పర్వీన్ విఆర్ఓ నాగేశ్వరరావు గ్రామ సర్వేయర్లు గ్రామ రైతులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!
			

 JOURNALIST B SAIKUMAR NAIDU
 JOURNALIST B SAIKUMAR NAIDU