
రజకుల ఇంటి పట్టాలు అమ్ముకున్న వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు
రజకుల ఇంటి పట్టాలను ఇతరులకు కేటాయించిన గత ఎమ్మార్వో వేణుగోపాల్
గోనెగండ్ల, న్యూస్ వెలుగు; గోనెగండ్ల గ్రామంలో రజకులకు 1992 సంవత్సరంలో సర్వేనెంబర్ 581 /1 లో 66 ఇంటి పట్టాలు మూడు సెంట్ల ప్రకారం ఇవ్వడం జరిగింది. వాటిలో పునాదులు కూడా వేయడం జరిగింది. కానీ కొన్ని అనివార్య కారణాల వలన అక్కడ పునాదులు వేసిన నిలిచిపోయాయి. గత ప్రభుత్వం మళ్లీ మీ పట్టాలు మీకు ఇస్తామని రజకులు అందుకు ఒప్పుకున్నారు. కానీ 120 ఇంటి పట్టాలలో 100 పట్టాలు రజకులకు ఇచ్చి 20 పట్టాలు వైయస్సార్ పార్టీ కార్యకర్తలు ఇందులో ప్లాట్ నెంబర్ 1 నుంచి 2 వరకు విక్రయించి ఇతర కులస్తులు ప్రహరీ గోడలు నిర్మించుకున్నారు.ఇతర కులాలకు అమ్ముకున్నారు. రజకుల ఇంటి పట్టాలను అమ్మిన వైయస్సార్ పార్టీ కార్యకర్తలు అయినా బండ్ల శివ రాముడు, సిపి మద్దిలేటి,పెద్దింటి శ్రీనివాసులు, శేఖర్, ఇందుకు సహకరించిన అధికారులను చట్టం ప్రకారం విచారణ చేసి వారి పైన కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా గోనెగండ్ల రజక సంఘం ఐక్యవేదిక నాయకులు సి రవికుమార్, సి శంకరన్న డిమాండ్ చేశారు.


 DESK TEAM
 DESK TEAM