డాక్టర్‌ ఎన్‌టిఆర్‌ వైద్య సేవ ఫీల్డ్‌ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలి

డాక్టర్‌ ఎన్‌టిఆర్‌ వైద్య సేవ ఫీల్డ్‌ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలి

అంబేద్కర్ సేన, మాల మహానాడు నాయకులు

ప్రొద్దుటూరు టౌన్, న్యూస్ వెలుగు;  ఎన్‌టిఆర్‌ వైద్యసేవ ఫీల్డ్‌ సిబ్బంది వైద్య మిత్ర, టీం లీడర్‌, ఆఫీస్‌ అసోసియేట్‌ జిల్లా మేనేజర్లు ఉద్యోగులుగా 2007 సంవత్సరం నుండి పనిచేస్తున్నారు. వీరిలో అత్యధికులు దళిత గిరిజన బలహీన వర్గాలకు చెందినవారు . వీరికి ఏకైక జీవనోపాధి ఈ చిరుద్యోగం మాత్రమే. నెలసరి జీతభత్యము రూ.13,087లుతో యావత్‌ కుటుంబం ఆధారపడి జీవిస్తున్నారు. అందరూ డిగ్రీ, పి.జి, బిఎస్సీ నర్సింగ్‌, ఎమ్మెస్సీ నర్సింగ్‌, బి.ఫార్మసీ, ఫార్మా డి చదువుకున్నవాళ్ళు. వీరు గత 18 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు . ఉద్యోగ భద్రత లేదు. చాలీచాలక అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మూలిగే నక్క పై తాటికాయ పడ్డ సామెత లా పత్రికలలో, మీడియాలో వస్తున్న వార్తలను బట్టి డా॥ ఎన్‌టిఆర్‌ వైద్య సేవ ట్రస్టును ట్రస్టు పరిధి నుంచి మినహాయించి హెల్త్‌ భీమా అమలు పథకం మార్పునకై ప్రభుత్వ యోచన చేస్తున్నట్లు తెలుస్తున్నది. ఫలితంగా ఉద్యోగాలు కోల్పోతామనే ఆందోళనలో వారు ఉన్నారు. కాబట్టి వీరికి ఉద్యోగ భద్రత కల్పించవలసిందిగా భరోసా ఇవ్వాల్సిన బాధ్యత మన రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. వారి న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నాను. ఈ కార్యక్రమంలో దప్పెల్ల దేవదాసు అంబేద్కర్ సేన రాష్ట్ర కన్వీనర్, .సాగర్ అంబేద్కర్ సేన రాష్ట్ర కమిటీ నెంబర్, వై.రాజు మాల మహానాడు ప్రొద్దుటూరు నియోజవర్గ అధ్యక్షుడు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!