104 సమస్యలు వెంటనే పరిష్కరించాలి
కడప సర్కిల్, న్యూస్ వెలుగు; సోమవారం ఉదయం కడప నగరంలోని సిఐటియు జిల్లా కార్యాలయంలో 104 ఉద్యోగుల జిల్లా కమిటీ సమావేశాలు జరిగినయి
ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ 104 ఎంప్లాయీస్ యూనియన్ మహమ్మద్ అలీ అధ్యక్షత వహించారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సిఐటియు జిల్లా అధ్యక్షులు కామనురు శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూచాలీచాలని వేతనాలతో కుటుంబాలను పోషించుకోవడం కష్టంగా మారిందని, వెంటనే న్యాయం చేయాలని
. 104 సేవల నిర్వహణను గతంలో మాదిరి నిర్వహిస్తే ప్రజలకు మేలు జరుగుతుందని, 104 సేవలను ప్రభుత్వమే పిహెచ్సిల ద్వారా నిర్వహించాలని కోరారు. సిబ్బంది బకాయిలన్నిటినీ అరబిందో యాజమాన్యం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. గతంలో ప్రభుత్వ చర్చల్లో అంగీకరించిన విధంగా అరబిందో యాజమాన్యం 2024 ఏప్రిల్ నుండి అమలు చేస్తామని అంగీకరించిన విధంగా నియమితులై 16 ఏళ్లుగా పనిచేస్తున్న డ్రైవర్లకు స్లాబ్ ప్రకారం వేతనాలు చెల్లిం చాని విజ్ఞప్తి చేశారు. 2020 నుండి పనిచేస్తున్న డిఇఒ, డ్రైవర్లు అందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని కోరారు. ప్రభుత్వ నియామకాల్లో వారికి వెయిటేజ్ ఇవ్వాలన్నారు. వేతనాలను నెలనెలా సమకాలంలో చెల్లించాలని, చట్ట ప్రకారం కట్టాల్సిన పిఎఫ్ వాటాను కట్టాలని కోరారు. ఇతర కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల మాదిరి రిటైర్మెంట్ వయసు 60 ఏళ్లకు పెంచాలని, వాహనాల రిపేర్లు, మెయింటేనెన్స్ చేయాలని అన్నారు. వాహనాలకు ఫిట్నెస్ ఇన్సూరెన్స్ వెంటనే చేయించాలని విజ్ఞప్తి చేశారుఈ కార్యక్రమంలో బాబావల్లి మహమ్మద్ అలీ, నాగమల్లేశ్వరరావు మహబూబ్ బాషా ,నాగేంద్ర,సురేష్ కృష్ణ ,శ్రీరాములుతదితరులు పాల్గొన్నారు.