పారిశుద్ధ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

పారిశుద్ధ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ సిఐటియు అనుబంధం

జమ్మలమడుగు, న్యూస్ వెలుగు; జమ్మలమడుగు స్థానిక మున్సిపల్ కార్యాలయం నందు సోమవారం మున్సిపల్ యూనియన్ నాయకులు సీ.శేఖర్ అధ్యక్షతన. ధర్నా నిర్వహించారు.అనంతరం సిఐటియు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బి.విజయ్ కుమార్. స్థానిక సిఐటియు. నాయకులు జి ఏసుదాసు. దాసరి విజయ్. మున్సిపల్ అధికారికి సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజారోగ్యం,పర్యావరణం, మున్సిపాలిటీ పరిశుభ్రత కోసం పారిశుద్ధ్య,ఇంజనీరింగ్ కార్మికులతో పాటు పర్మినెంట్ సిబ్బంది,కోవిడ్ బదిలీ కార్మికులు,డ్రైవర్లు సేవలు చేస్తున్నారని అయితే కార్మికులకు చట్టబద్ధమైన భద్రతా సౌకర్యాలు కల్పించడం,వాహనాలమరమ్మత్తులు చేయించడం,రక్షణ పరికరాలు,పనిముట్లు,యూనిఫారాలు,చెప్పులు,సకాలంలో ఇవ్వాలని,వారాంతపు, క్యాజువల్,జాతీయ సెలవులు పక్కాగా అమలు చేయాలని,పండుగ కానుక వెయ్యి రూపాయలు వెంటనే చెల్లించాలని వారన్నారు. ఈపీఎఫ్,ఈఎస్ఐ అమలులో ఉన్న లోపాలను వెంటనే సరిదిద్దాలని అన్నారు,
ఆప్ కాస్ ద్వారా రిటైర్మెంట్ చేసిన కార్మికుల పిల్లలకు ఉపాధి కల్పించాలని,డ్రైవర్లకు జీవో ఎంఎస్ నెంబర్ 36 తేది 01/03/2024 ప్రకారం రూ.24500/-లు వేతనం ఇవ్వాలని,ఇంజనీరింగ్ కార్మికులకు కూడా వేతనాలు పెంచి రూ.21000/-లు ఇవ్వాలని,పర్మినెంట్ సిబ్బందికి సరెండర్ లీవులు,డి ఎ బకాయిలు,జిపిఎఫ్ అకౌంట్లు తదితర సమస్యలు పరిష్కరించాలని,పట్టణ విస్తరణ మేరకు సిబ్బంది సంఖ్య ఏళ్ళ తరపడి పెంచడం లేదని,నిబంధనలకు విరుద్ధంగా కార్మికులను ఇతర పనులకు వాడుకోవడం వల్ల మిగిలిన కార్మికుల పైన రోజు రోజుకూ పని భారం పెరుగి శ్రమ దోపిడీ జరుగుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.కార్మికుల సంఖ్య వెంటనే పెంచాలన్నారు. మాస్టర్ పాయింట్ వద్ద మంచినీటి వసతి కానీ,కనీసం టాయిలెట్స్,మరుగుదొడ్ల సౌకర్యాలు కూడా లేక కార్మికులు,ముఖ్యంగా మహిళా కార్మికులు నానా అవస్థలు పడుతున్నారని తెలిపారు.గత 17 రోజుల సమ్మె సందర్భంగా ప్రభుత్వం అంగీకరించి మినిట్స్ కాపీలో పేర్కొన్న ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వద్ద పెండింగ్ లో ఉన్న రిటైర్మెంట్ బెనిఫిట్స్,ప్రమాద మృతులకు ఎక్స్గ్రేషియా 5 నుండి 7 లక్షలకు పెంపు,దహన సంస్కారాలకు ఆర్థిక సహాయము 15 నుండి 20 వేలకు పెంపు,ఇంజనీరింగ్ కార్మికుల జీతాల నిర్ణయం మొదలైన వాటికి వెంటనే జీవోలు జారీ చేయాలని డిమాండ్ చేశారు.మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులు,వేధింపులను నివారించడానికి సుప్రీంకోర్టు సూచనల మేరకు కంప్లైంట్ కమిటీలను ఏర్పాటు చేయాలని అందులో మహిళా కార్మికులను సభ్యులుగా చేర్చాలన్నారు.కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని గతంలో పలు మార్లు విన్నవించినా సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదని ఇప్పటికైనా 15 రోజుల లోగా సమస్యలు పరిష్కరించాలని లేని యెడల ఆందోళన పోరాటాలతో సహా సమ్మెకు పూనుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు…ఈ కార్యక్రమంలో మైఖేల్. బాలు. పుల్లమ్మ. లక్ష్మి. మరియమ్మ. తిరుపాలమ్మ. పాల్గొన్నారు

Author

Was this helpful?

Thanks for your feedback!