
తుగ్గలిలో ప్రారంభమైన టిడిపి సభ్యత్వ నమోదు కార్యక్రమం
* టీడీపీ కార్యకర్తల సంక్షేమం కొరకే సభ్యత్వ కార్యక్రమం
* టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహన కార్యదర్శి తుగ్గలి నాగేంద్ర.
తుగ్గలి న్యూస్ వెలుగు ప్రతినిధి: మండల కేంద్రమైన తుగ్గలి నందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు పత్తికొండ శాసనసభ్యులు కేయి శ్యామ్ కుమార్ ఆదేశాల మేరకు టిడిపి రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి తుగ్గలి నాగేంద్ర అధ్యక్షతన గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకుల,గ్రామ సర్పంచ్ రవి ఆధ్వర్యంలో తుగ్గలి గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకుల మరియు కార్యకర్తల సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సోమవారం రోజున ఘనంగా ప్రారభించారు.ఈ సందర్బంగా సభ్యత్వం తీసుకున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు తుగ్గలి నాగేంద్ర సభ్యత్వం కార్డులను అందజేశారు.అనంతరం తుగ్గలి నాగేంద్ర మాట్లాడుతూ టీడీపీ పార్టీ సభ్యత్వం రేపటి బంగారు భవిష్యత్ కు ఆదర్శమని,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ముందుచూపు తో టీడీపీ నాయకుల,కార్యకర్తల సంక్షేమం కోసం 2024 నుంచి 2026 టీడీపీ పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియను అక్టోబర్ 26వ తేదీన ప్రారంభించడం సంతోషంగా ఉన్నదని,పార్టీ సభ్యత్వ నమోదు చేసుకున్న పార్టీ నాయకులు, కార్యకర్తలకు అనుకోని సంఘటనలలో ఏదైనా ప్రమాధం జరిగినపుడు పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రతి కుటుంబానికి భీమా వర్తించి,కుటుంబ సభ్యులు ఆర్థికంగా వెసులుబాటుకు కోదవ ఉండకూడదని,వంద రూపాయలు కట్టి టీడీపీ పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రతి కుటుంబ సభ్యులకు భీమా వర్తించిన వారు అకాల మరణం చెందినప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి 5 లక్షల రూపాయలు కుటుంబానికి ఆర్థికంగా పార్టీ నాయకత్వం పూర్తి భాద్యత వహిస్తుందని ఆయన తెలియజేశారు. గ్రామాలలో ఉన్న ప్రతి తెలుగుదేశం పార్టీ నాయకులు,కార్యకర్తలు వారి కుటుంబంలో ఉన్న 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళలకు,పురుషులకు తప్పకుండ తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకోవాలని టిడిపి రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి తుగ్గలి నాగేంద్ర తెలియజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ వార్డు మెంబర్లు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.