శ్రీ నారాయణ ఆంజనేయస్వామి ఆలయంనకు జీర్ణోద్ధరణ

   శ్రీ నారాయణ ఆంజనేయస్వామి ఆలయంనకు జీర్ణోద్ధరణ

బండి ఆత్మకూరు, న్యూస్ వెలుగు;  బండి ఆత్మకూరు మండలంలోని నారాయపురం గ్రామంలో శ్రీ నారాయణ ఆంజనేయస్వామి దేవాలయంకు జీర్ణోద్ధరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వేదపండితులు కృష్ణ మోహన్ శర్మ, వింజమురి గౌతమ శర్మ, వనం శ్రీనివాస శర్మ, జంధ్యాలహేమంత్ శర్మ దేవతామూర్తులకు అభిషేకములు కళాపకర్షణ ఇత్యాది కార్యక్రములు నిర్వహించి గర్భగుడిలో ఉన్న ఆంజనేయస్వామి నారాయణస్వామి ఈశ్వర స్వామి విగ్రహాలను మరొక చోటికి తరలించారు. ఈ సందర్భంగా ఈవో నాగప్రసాద్ మాట్లాడుతూ శ్రీ నారాయణ ఆంజనేయస్వామి ఆలయముకు జీర్ణోద్ధరణ కార్యక్రమం నిర్వహించామని అన్నారు. దేవాలయం పునర్నిర్మాణానికి సిజిఎఫ్ నిధుల నుండి కోటి 20 లక్షల రూపాయలు మంజూరయ్యాని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలశంకర్ మల్లికార్జున నడిపినేని కృష్ణుడు అనంతయ్య విష్ణు ఆనంద్ గ్రామ విఆర్ఓ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!