
టీడీపి సభ్యత్వ నమోదు ప్రారంభం
హోళగుంద, న్యూస్ వెలుగు: మండల పరిధిలోని హెబ్బటం గ్రామంలో సోమవారం ఆలూరు తాలూకా టీడీపీ ఇంచార్జ్ వీరభద్ర గౌడ్ ఆదేశాల మేరకు వివిధ కాలనీల్లో టిడిపి నాయకులు నాగయ్య,యూనిట్ ఇంచార్జ్ సవరప్ప,బూత్ ఇంచార్జ్ లు, మల్లికార్జున,గోపాల్,శేక్షవలి గజ్జహళ్లి నబి నబి రసూల్ తదితరులు సభ్యత్వం నమోదు కార్యక్రమం ప్రారంభించారు.ఈ సందర్భంగా యూనిట్ ఇంచార్జ్ సవరప్ప మాట్లాడుతూ టిడిపి పార్టీ అంటే క్రమశిక్షణ గల పార్టీ అని పార్టీలో సభ్యత్వం ఉన్న నాయకులను,కార్యకర్తలను కాపాడుకోవడం చంద్రబాబు నాయుడు బాధ్యతని ఆలూరు నియోజకవర్గం నాయకులకు, కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా పార్టీ ఇంచార్జ్ వీరభద్ర గౌడ్ మరియు పార్టీ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని పార్టీ సభ్యత్వం ద్వారా ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే 5 లక్షల రూపాయలు,సహజ మరణం పొందితే 10,000 మట్టి ఖర్చులకు అందిస్తుందని చెప్పారు.అలాగే పేద విద్యార్థులకు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు ద్వారా ఉన్నత చదువులకు సహాయ సహకారాలు అందించుటకు పార్టీ తోడ్పడుతుందని తెలియజేశారు.