రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు తుగ్గలి హై స్కూల్ విద్యార్థులు ఎంపిక

రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు తుగ్గలి హై స్కూల్ విద్యార్థులు ఎంపిక

తుగ్గలి, న్యూస్ వెలుగు ప్రతినిధి: రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు తుగ్గలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎంపికైనట్లు తుగ్గలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు సంధ్యా నాయక్ తెలియజేశారు.మంగళవారం రోజున ఆయన మాట్లాడుతూ ఈనెల 22న కర్నూలు నందు జరిగిన జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్ పోటీలలో తుగ్గలి విద్యార్థులు ఖోఖో పోటీలలో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపికైనట్లు ఆయన తెలియజేశారు.అండర్-14 భాగంలో రంజిత్,సమీరా మరియు అండర్-17 విభాగంలో అరుణ్ కుమార్ స్టాండ్ బైగా ఎంపిక అయినట్లు ఆయన తెలియజేశారు.పల్నాడు జిల్లా, కారంపూడి నందు నవంబర్ 7 నుండి 9 వరకు జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో వీరు పాల్గొంటారని ఫిజికల్ డైరెక్టర్ సంధ్యా నాయక్ తెలియజేశారు.విద్యార్థులు ఎంపిక కావడం పట్ల పాఠశాల సిబ్బంది అభినందించారు.ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు బాబురావు, ఉపాధ్యాయులు రాజమోహన్,శీను, సుధాకర్,దాసు నాయక్,నారాయణ, రంగ,రజాక్,భాస్కర్,సౌభాగ్య,రిజ్వాన్, షుకూర్,చాంద్ భాషా,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!