ఉపాది హామీ సిబ్బందితో సమీక్ష సమావేశం
బండి ఆత్మకూరు, న్యూస్ వెలుగు; మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం ఎంపీడీవో దస్తగిరి ఏపీవో వసుధ ఆధ్వర్యంలో ఉపాధి హామీ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉపాధి హామీ పనుల కల్పన హార్టికల్చర్ అవెన్యూ ప్లాంటేషన్ హౌసింగ్ 90 రోజుల పని దినాలు భువన్ అప్లికేషన్ నందు పనులు క్యాప్చర్ చేయుట మొదలైన అంశాలపై సిబ్బందికి వివరించారు. ఈ కార్యక్రమంలో ఈసీ వరదరాజులు ప్లాంటేషన్ సూపర్వైజర్ వెంకటసుబ్బయ్య టెక్నికల్ అసిస్టెంట్లు కంప్యూటర్ ఆపరేటర్లు ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!