కడప ఉక్కు సాధనే లక్ష్యంగా పోరాటాలు సాగిస్తాం
డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరణాల.శివకుమార్
జమ్మలమడుగు టౌన్, న్యూస్ వెలుగు; రాబోవు రోజులలో కడప ఉక్కు సాధననే లక్ష్యంగా యువతను ఐక్యం చేసి పోరాటాలు నిర్వహిస్తామని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరణాల.శివకుమార్ తెలిపారు. డివైఎఫ్ఐ 44 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జమ్మలమడుగు లో ముద్దనూరు రోడ్డులో డివైఎఫ్ఐ స్థూపం వద్ద జెండా ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ కడప ఉక్కు ఆంధ్రుల హక్కు అని అన్నారు.ముఖ్యమంత్రులు మారుతున్నారు కానీ కడప ఉక్కు పరిశ్రమ నిర్మాణ జరగడం లేదు అన్నారు.ముఖ్యమంత్రులు వేసిన శిలా ఫలకాలు సమాధి రాళ్ళు లాగా వెక్కిరిస్తున్నాయి అన్నారు.వెనుకబడిన రాయలసీమ ప్రాంతంలో చదువుకున్న యువతకు ఉద్యోగ ఉపాధి పరిశ్రమలు లేక ఇతర దేశాలకు,రాష్ట్రాలకు వలసలు పోతున్నారు అన్నారు.యువతకు ఉద్యోగాలు కలగాలంటే,రాయలసీమ అభివృద్ధి చెందాలంటే కడప ఉక్కు పరిశ్రమే ఏకైక మార్గం అన్నారు.కేంద్ర ప్రభుత్వం కడప ఉక్కు వైపు చూడకుండా నిధులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నది అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంలో కీలక పాత్ర లో వుంది కాబట్టి కేంద్రం పైన ఒత్తిడి తీసుకువచ్చి కడప ఉక్కు పరిశ్రమ నిర్మాణానికి చర్యలు చేపట్టాలని కోరుతున్నాం అన్నారు.రాబోవు రోజులలో అమరుల త్యాగాల స్ఫూర్తితో కడప ఉక్కు కోసం నిరుద్యోగ యువతకు ఉపాధి కోసం DYFI జెండా చేతపట్టి పోరాటాలను నిర్వహిస్తామని అన్నారు.కార్యక్రమంలో పట్టణ అధ్యక్ష,కార్యదర్శులు ఎల్లయ్య, తులసిశ్వర్ యాదవ్,పట్టణ నాయకులు కృష్ణా రెడ్డి,సురేష్,వంశి,సూరి,రాఘవ తదితరులు పాల్గొన్నారు.