ప్రతి ప్రభుత్వ ఉద్యోగి మండల హెడ్ క్వార్టర్ లో నివసించాలి
ఆర్ఎస్ఓ, ఏపీ ఎమ్మార్పీఎస్ విద్యార్థి ప్రజా సంఘాల నాయకుల డిమాండ్…
రాజుపాలెం, న్యూస్ వెలుగు; స్థానిక రాజుపాలెం మండలంలోని తహసిల్దార్ కార్యాలయంలోని మండల రెవెన్యూ ఆఫీసర్ వెంకటేశ్వర్లు రాయలసీమ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షులు జగన్, ఆంధ్రప్రదేశ్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కడప జిల్లా ఉపాధ్యక్షులు చింతల మారయ్య తదితరులు మాట్లాడుతూ, రాజుపాలెం మండలంలోని ప్రతి ప్రభుత్వ ఉద్యోగి మండల హెడ్ క్వార్టర్ లో నివసించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 20 8-2-2001 ఇవ్వడం జరిగింది అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏ ఒక్క ప్రభుత్వ ఉద్యోగి హెడ్ క్వార్టర్ లో నివసించకుండా ఇతర ప్రదేశాల నుంచి డ్యూటీకి రావడం జరుగుతుంది దీని వల్ల ప్రజలకు అందుబాటులో లేకుండా నిర్లక్ష్యం జరుగుతుంది కనుక ప్రతి ప్రభుత్వ ఉద్యోగి మండల హెడ్ క్వార్టర్ లో నివసించే విధంగా చర్యలు తీసుకొని కొన్ని ప్రభుత్వ సంస్థలు పోలీస్ డిపార్ట్మెంట్ హెల్త్ సెంటర్ లో 24 అవర్స్ ప్రజలకు అందుబాటులో ఉండాల్సివి కనుక కనీసం వీరు కూడా హెడ్ క్వార్టర్ లో నివసించకుండా వుండడం ప్రజలను నిర్లక్ష్యం చేసినట్టేనని వీటన్నింటినీ పరిగణలోకి తీసుకొని ప్రతి ప్రభుత్వ ఉద్యోగి జవాబుదారిగా పనిచేసే విధంగా చర్యలు తీసుకొని ప్రతి ప్రభుత్వ ఉద్యోగి మండల హెడ్ క్వార్టర్ లో నివసించే విధంగా చర్యలు తీసుకొని మండల ప్రజానీకానికి న్యాయం చేయాలని లేని పక్షంలో దీనిపైన ఉద్యమాలు చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.