వైభవంగా విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం

వైభవంగా విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం

మూడు రోజులుగా రమణీయంగా సాగిన విఘ్నేశ్వర విగ్రహ ప్రతిష్టాపన.
విఘ్నేశ్వర,మల్లేశ్వర విగ్రహాలకు ప్రాణ ప్రతిష్టాపన చేసిన అజాత శంభులింగ శివాచార్య మహస్వాములు
హోళగుంద, న్యూస్ వెలుగు: మండల కేంద్రంలో మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీ అగ్రహారం ఆంజనేయస్వామి దేవాలయం వద్ద నూతన శ్రీ విఘ్నేశ్వర విగ్రహ ప్రతిష్టాపన మరియు నూతన ఆలయ ప్రవేశ కార్యక్రమం అగ్రహారం ఆంజనేయస్వామి సేవ సమితి ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది.ముఖ్యంగా నూతన విఘ్నేశ్వర విగ్రహాన్ని శుక్రవారం జలాధివాసంలో ఉంచి,శనివారం దాన్యాదివసం ఉంచి మరియు సాయంత్రం నుండి అర్ధరాత్రి రెండు గంటల వరకు వేదపండితులు పెద్దహ్యాట రుద్రయ్య స్వామి పురోహిత బృందం మంత్రోచరణల నడుమ రుద్ర హోమం నిర్వహించారు.ఆదివారం తెల్లవారుజామున 5 గంటలకు శ్రీ విఘ్నేశ్వర విగ్రహన్ని ప్రతిష్టాపించారు.అనంతరం శ్రీ పరమపూజ్యులు ష||బ్ర|| అజాత శంభులింగ శివాచార్య మహా స్వాముల అమృత హస్థంచే శ్రీ విఘ్నేశ్వర విగ్రహానికి ప్రాణ ప్రతిష్టాపన చేశారు.ప్రధానంగా ఆలయాన్ని పచ్చని తోరణాలు,విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు.అలాగే శ్రీ విఘ్నేశ్వర విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.అదేవిధంగా ఆలయానికి వచ్చిన భక్తులకు సేవా సమితి వారు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ సేవా సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!